📜
నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్బుద్ధస్స.
బాలావతార
పణామ
[క]
సబ్బం నిరుత్తిపథపారగతం సబుద్ధం,
బుద్ధం తిలోకతిలకం హతపాపధమ్మం;
ధమ్మం విముత్తిసుఖదం విహతాఘసంఘం,
సంఘం చ నిచ్చమభివన్దియ దక్ఖిణేయ్యం.
[ఖ]
వుద్ధిప్పత్తోస్మి ముద్ధో మమ వరగరవో సీలపఞ్ఞాదిసోభే,
చన్దాదిచ్చేవ సుద్ధే వరజినఠపితే సాసనాబ్భే పతీతే;
నిస్సాయేవా తిపేమా పణమియ సిరసా నిచ్చమేసం సరిత్వా,
పాదమ్భోజే గుణగ్గే హతదురితమలో ఆనుభావేన తస్సా.
[గ]
పోరాణ సీహళ పదత్థ వినిచ్ఛయఞ్చ,
సబ్బమ్పి మాగధనిరుత్తినయం పసత్థం;
అఞ్ఞఞ్చ నేకవిధ సక్కత సద్దసత్థం,
పారమ్పరాభత మతఞ్చ నిసమ్మ సమ్మా.
[ఘ]
బాలావతార వరమాగధ సద్దసత్థే,
దుబ్బోధ నేకపదఅత్థ వినిచ్ఛయేన;
అత్థాయ ఆధునిక బాలపరమ్పరాయ,
బాలావతార వరగణ్ఠిపదం కరిస్సం.
[ఙ]
నిచ్చం యే మేత్థ బాలా వరహదయయుతా సుట్ఠు నిక్ఖిత్తనేత్తా,
పుణ్ణే నానానయానం సురతరుసదిసే ధీరపాసంసియే వే;
గమ్భీరం దుత్తరం తే జినవచనుదధిం తిణ్ణథామా భవేయ్యుం,
లద్ధోపాయా చ చన్దం తదితరపచురం సక్కతం సోతుకామా.
[చ]
గన్థనిప్ఫత్తియా సేస – దుక్కరత్తం యథావతో;
జానన్తి కుసలా ధీరా, నేకసత్థన్తరాదిసు;
గన్థేసు గుణదోసమ్పి, తేయేవ విదురా సదా.
[ఛ]
తస్మా ఏత్థ పమాదాది – దోసలేసో భవే యది;
పోరాణాచేరలద్ధీహి, విలోమం వా భవేయ్య చే.
[జ]
గన్థన్తరం విగాహేత్వా, విచారేత్వా పునప్పునం;
యుత్తిమేవ చ గణ్హన్తు, హుత్వా వీమంసబుద్ధికాతి.
పణామ
౧. బుద్ధం ¶ తిధా భివన్దిత్వా, బుద్ధమ్బుజ విలోచనం.
బాలావతారం భాసిస్సం, బాలానం బుద్ధివుద్ధియా.
౧. సన్ధి కణ్డ
సఞ్ఞా
అక్ఖరాపి ¶ అకారాదయో ఏకచత్తాలీసం సుత్తన్తోపకారా. తం యథా-అ ఆ-ఇ ఈ-ఉ ఊ-ఏ ఓ, క ఖ గ ఘ ఙ, చ ఛ జ ఝ ఞ, ట ఠ డ ఢ ణ, త థ ద ధ న, ప ఫ బ భ మ, య ర ల వ స హ ళ అం-ఇతి.
తత్థ ¶ అక్ఖరేసు ఓకారన్తా అట్ఠ సరా నామ. తత్థేతి వత్తతే.
తత్థ ¶ సరేసు లహుమత్తా అ, ఇ, ఉ ఇతి తయో రస్సా.
తత్థ ¶ సరేసు రస్సేహఞ్ఞే దీఘా.
సంయోగతో పుబ్బే ఏఓ రస్సా ఇవోచ్చన్తే, అనన్తరా బ్యఞ్జనా సంయోగో. ఏత్థ, సేయ్యో, ఓట్ఠో, సోత్థి.
సరే ¶ ఠపేత్వా సేసా కాదయో నిగ్గహీతన్తా బ్యఞ్జనా.
బ్యఞ్జనానం ¶ కాదయో మకారన్తా పఞ్చపఞ్చసో అక్ఖరవన్తో వగ్గా.
౮. వగ్గానం ¶ పఠమదుతియా సో చాఘోసో. ళన్తాఞ్ఞే ఘోసా. ఘోసాఘోససఞ్ఞా చ ‘‘పరసమఞ్ఞా పయోగే’’తి సఙ్గహీతా. ఏవం లిఙ్గ, సబ్బనామ, పద, ఉపసగ్గ, నిపాత, తద్ధిత, ఆఖ్యాత, కమ్మప్పవచనీయాదిసఞ్ఞా చ.
అంఇతి ¶ అకారతో పరం యో బిన్దు సూయతే, తం నిగ్గహీతం నామ.
బిన్దు ¶ చూళామణాకారో, నిగ్గహీతన్తి వుచ్చతే.
కేవలస్సా ప్పయోగత్తా, అకారో సన్నిధీయతే.
౧౦. అ, కవగ్గ, హా కణ్డజా, ఇ, చవగ్గ, యా తాలుజా, ఉ, పవగ్గా ఓట్ఠజా, టవగ్గ, ర, ళా ముద్ధజా, తవగ్గ, ల, సా దన్తజా, ఏ కణ్ఠతాలుజో, ఓ కణ్ఠోట్ఠజో, వో దన్తోట్ఠజో.
సఞ్ఞా
సరసన్ధి
౧౧. లోక ¶ అగ్గోఇత్యస్మిం – ‘‘పుబ్బమధోఠిత మస్సరం సరేన వియోజయే’’తి పుబ్బబ్యఞ్జనం సరతో పుథక్కాతబ్బం.
సరా సరే లోపం.
అనన్తరే సరే పరే సరా లోపం పప్పోన్తి.
‘‘నరే ¶ పరం యుత్తే’’తి అస్సరో బ్యఞ్జనో పరక్ఖరం నేతబ్బో లోకగ్గో.
సరేత్యస్మిం ¶ ఓపసిలేసికో కాససత్తమీ, తతో వణ్ణకాలబ్యవధానే కారియం న హోతి. యథా-మం అహా సీతి, ‘‘పమాదమనుయుఞ్జన్తీ’’త్యాదిగాథాయం ‘జనా అప్పమాద’న్తి చ. ఏవం సబ్బసన్ధీసు.
అనన్తరం పరస్స సరస్స లోపం వక్ఖతి, తస్మానేన పుబ్బస్స లోపో ఞాయతి, తేనేవ సత్తమీనిద్దిట్ఠస్స పరతాపి గమ్యతే.
౧౨. సరేత్యధికారో. ¶ పన ఇమే పన ఇమేతీహ-సరా లోపం ఇత్వేవ.
వా పరో అసరూపో.
అసమానరూపాసరమ్హా పరో సరో వా లుప్యతే, పనమే, పనిమే.
౧౩. బన్ధుస్స ¶ ఇవ, న ఉపేతీతీధ –
క్వచాసవణ్ణం లుత్తే.
సరే లుత్తే పరసరస్స క్వచి అసవణ్ణో హోతీతి ఇ ఉ ఇచ్చేతేసం ఠానాసన్నా ఏ ఓ. బన్ధుస్సేవ. నోపేతి.
౧౪. తత్ర ¶ అయం, యాని ఇధ, బహు ఉపకారం, సద్ధా ఇధ, తథా ఉపమన్త్యేతస్మిం –
దీఘం.
సరే లుత్తే పరో సరో క్వచి ఠానాసన్నం దీఘం యాతి. తత్రాయం, యానీధ, బహూపకారం, సద్ధీధ, తథూపమం.
పుబ్బో చ.
సరే లుత్తే పుబ్బో చ క్వచి దీఘం యాతి. కిం సూధ.
౧౬. తే ¶ అజ్జ, తే అహంతేత్థ –
యమేదన్తస్సాదేసో.
సరే పరే అన్తస్స ఏకారస్స క్వచి యో ఆదేసో హోతి, త్యజ్జ, ‘‘దీఘ’’న్తి బ్యఞ్జనే పరే క్వచి దీఘో, త్యాహం.
క్వచీతి కిం. నేత్థ.
౧౭. సో ¶ అస్స, అను ఏతిత్యేత్థ –
వమోదుదన్తానం.
సరే పరే అన్తో కారుకారానం క్వచి వో ఆదేసో హోతి. స్వస్స, అన్వేతి.
క్వచీతి కిం. తయస్సు, సమేతాయస్మా.
౧౮. ఇధ ¶ అహం తీధ –
దో ధస్స చ.
సరే పరే ధస్స క్వచి దో హోతి. దీఘే – ఇదాహం. క్వచీతి కిం. ఇధేవ. చకారేన బ్యఞ్జనేపి, ఇధ భిక్ఖవే.
౧౯. పతి అన్తుం, వుత్తి అస్సేతీహ –
ఇవణ్ణో యన్నవా.
సరే పరే ఇవణ్ణస్స యో నవా హోతి. కత యకారస్స తిస్స ‘‘సబ్బో చన్తీ’’తి క్వచి చాదేసే ‘‘పరద్వేభావో ఠానే’’తి సరతో పరబ్యఞ్జనస్స ఠానాసన్నవసా ద్విత్తం. పచ్చన్తం, వుత్యస్స.
నవాతి కిం. పటగ్గి,
ఏత్థ ‘‘క్వచి పటి పతిస్సే’’తి పతిస్స పటి, వణ్ణగ్గహణం సబ్బత్థ రస్సదీఘ సఙ్గహణత్థం.
౨౦. యథా ¶ ఏవేతీహ –
ఏవాదిస్స రి పుబ్బో చ రస్సో.
సరతో పరస్స ఏవస్సాదిఏకారో రిత్తం నవా యాతి. పుబ్బో చ ఠానాసన్నం రస్సం. యథరివ. యథేవ.
౨౧. న ¶ ఇమస్స, తి అఙ్గికం, లహు ఏస్సతి, అత్థ అత్థం, ఇతో ఆయతి, తస్మా ఇహ, సబ్భి ఏవ, ఛ అభిఞ్ఞా, పుథ ఏవ, పా ఏవతీహ వా త్వేవ –
య వ మ ద న త ర ళా చాగమా.
సరే పరే యాదయో ఆగమా వా హోన్తి, చకారేన గో చ. నయిమస్స, తివఙ్గికం, లహుమేస్సతి, అత్తదత్థం, ఇతోనాయతి, తస్మాతిహ, సబ్భిరేవ, ఛళభిఞా, పుథగేవ, ‘‘రస్స’’న్తి బ్యఞ్జనే పరే క్వచి రస్సో. పగేవ.
వాతి కిం. ఛ అభిఞ్ఞా, పుథ ఏవ, పా ఏవ.
ఏత్థ ‘‘సరే క్వచీ’’తి సరానం పకతి హోతి, సస్సరూపమేవ, న వికారోత్యత్థో.
౨౨. అభి ¶ ఉగ్గతోత్యత్ర –
‘‘అబ్భో అభీ’’తి అభిస్స అబ్భో. అబ్భుగ్గతో.
సరసన్ధి
బ్యఞ్జనసన్ధి
౨౩. బ్యఞ్జనేత్యధికారో. క్వచీత్వేవ. సో భిక్ఖు, కచ్చి ను త్వం, జానేమ తన్తీహ –
లోపఞ్చ తత్రాకారో.
బ్యఞ్జనే పరే సరానం క్వచి లోపోహోతి, తత్ర లుత్తే ఠానే అకారాగమో, చకారేన ఓకారుకారాపి. సభిక్ఖు కచ్చినో త్వం, జానేము తం.
క్వచీతి కిం, సోముని.
౨౪. ఉఘోసో ¶ , ఆఖాతన్తీహ – ద్వేభావే ఠానే ఇత్వేవ.
వగ్గే ఘోసాఘోసానం తతియపఠమా.
వగ్గే ఘోసాఘోసానం చతుత్థదుతియానం తబ్బగ్గే తతియపఠమా హోన్తి యథాసఙ్ఖ్యం యుత్తే ఠానే, ఉగ్ఘోసో, రస్సే అక్ఖాతం.
౨౫. పర ¶ సహస్సం, అతిప్పఖోతీహ – ‘‘క్వచి ఓ బ్యఞ్జనే’’తి ఓకారాగమో. పరోసహస్సం. గాగమే చ, అతిప్పగోఖో.
౨౬. అవ నద్ధాత్యత్ర – ‘‘ఓ అవస్సే’’తి క్వచి అవస్స ఓ. ఓనద్ధా.
క్వచీతి కిం. అవసుస్సతు.
బ్యఞ్జనసన్ధి.
నిగ్గహీతసన్ధి
౨౭. నిగ్గహీతన్త్యధికారో ¶ . కిం కతో, సం జాతో, సం ఠితో, తం ధనం, తం మిత్తన్తిహ –
వగ్గన్తం వా వగ్గే.
వగ్గబ్యఞ్జనే పరే బిన్దుస్స తబ్బగ్గన్తో వా హోతి. కిఙ్కతో, సఞ్జాతో, సణ్ఠితో, తన్ధనం, తమ్మిత్తం.
వాతి కిం. న తం కమ్మం.
వాకారేనేవ లే లో చ. పుల్లిఙ్గం.
౨౮. వాత్యధికారో ¶ . ఏవం అస్స, ఏతం అవోచేతీహ –
మదా సరే.
సరే పరే బిన్దునో మ దా వా హోన్తి. ఏవమస్స, ఏతదవోచ.
వాతి కిం. మం అజిని.
ఏహేఞం.
ఏకారే, హే చ పరే బిన్దునో ఞో వా హోతి. ద్విత్తే – తఞ్ఞేవ, తమేవ. తఞ్హి, తం హి.
సయే చ.
యకారే పరే తేన సహ బిన్దునో ఞో వా హోతి. ద్విత్తే – సఞ్ఞోగో, సంయోగో.
౩౧. చక్ఖు అనిచ్చం, అవ సిరోతీహ - ఆగమో, క్వచిత్వేవ.
నిగ్గహీతఞ్చ.
సరే, బ్యఞ్జనే వా పరే క్వచి బిన్ద్వాగమో హోతి. చక్ఖుంఅనిచ్చం, అవంసిరో.
౩౨. విదూనం ¶ అగ్గం, తాసం అహంతీహ –
‘‘క్వచి లోపం’’తి సరే బిన్దులోపో, విదూనగ్గం. దీఘేతాసాహం.
౩౩. బుద్ధానం సాసనం, సం రాగోతీహ –
‘‘బ్యఞ్జనే చే’’తి బిన్దులోపో, బుద్ధానసాసనం. దీఘేసారాగో.
పరో వా సరో.
బిన్దుతో పరో సరో వా లుప్యతే, బీజంవ.
బ్యఞ్జనో చ విసఞ్ఞోగో.
బిన్దుతో పరే సరే లుత్తే సంయోగో బ్యఞ్జనో వినట్ఠసంయోగో హోతీతి పుబ్బసలోపో. ఏవంస.
నిగ్గహీతసన్ధి.
వోమిస్సక సన్ధీ
ఇధానిద్దిట్ఠా ¶ సన్ధయో వుత్తానుసారేన ఞే య్యా, యథా – యది ఏవం, బోధి అఙ్గాతీహ – యాదేసే ఇమినా సుత్తేన దయకారసంయోగస్స జో, ధయకారసంయోగస్స ఝో, ద్విత్తే – యజ్జేవం, బోజ్ఝఙ్గా.
౩౭. అసదిససంయోగే ¶ ఏకసరూపతా చ.
పరి ఏసనాతీహ – యాదేసే రకారస్స యో, పయ్యేస నా.
౩౮. వణ్ణానం ¶ బహుత్తం, విపరీతతా చ.
సరతి, ఇతి ఏవ, సా ఇత్థీ, బుసం ఏవ, బహు ఆబాధో, అధి అభవి, సుఖం, దుక్ఖం, జీవోతీహ –
మాగమో సకారే అకారస్స ఉ చ, సుమరతి.
ఇస్స వో, ఇత్వేవ.
పరలోపే ఆకారస్స ఓ, సోత్థీ.
మాదేసే ¶ , పుబ్బదీఘే చ ఏకారస్స ఇ. బుసామివ.
వాదేసే హవకారవిపరియయో. బహ్వాబాధో.
అధిస్స క్వచి అద్ధో, దీఘే-అద్ధాభవి.
బిన్దునో, ఓకారస్స చ ఏ. సుఖే, దుక్ఖే, జీవే.
౩౯. రదానం ¶ ళో, పటిబోధో, పరిళాహో.
౪౦. సరే, బ్యఞ్జనే వా పరే బిన్దునో క్వచి మో. మమ అభాసి, బుద్ధమ సరణం, పుబ్బే మో పరం న నేతబ్బో అయుత్తత్తా.
౪౧. బిన్దుతో పరసరాన మఞ్ఞస్సరతాపి.
తం ఇమినా, ఏవం ఇమం, కిం అహం తీహ-ఇస్స అ. తదమినా.
ఇస్స ఉ, అకారస్స చ ఏ, బిన్దులోపాదో. ఏవుమం, కేహం.
౪౨. వాక్యసుఖుచ్చారణత్థం, ఛన్దహానిత్థఞ్చ వణ్ణలోపోపి.
పటిసఙ్ఖాయ యోనిసోతీహ – పుబ్బయలోపో, పటిసఙ్ఖాయోనిసో.
౪౩. అలాబూనిత్యాదో ¶ అకారలోపో. లాబూని సీదన్తి, సిలా ప్లవన్తి.
అకరమ్హసే తేత్యాదో సకారే గరునో ఏకారస్స ఇమినా లహుఅకారో, అకరమ్హస తే కిచ్చం.
౪౫. అక్ఖరనియమో ¶ ఛన్దం, గరులహునియమో భవే వుత్తి,
దీఘో, సంయోగాదిపుబ్బో రస్సో చ గరు, లహు తు రస్సో. యథా- ఆ, అస్స, అం, అ.
ఏవమఞ్ఞాపి ¶ విఞ్ఞేయ్యా, సంహితా తన్తియా హితా;
సంహితాతి చ వణ్ణానం, సన్నిధబ్యవధానతో.
వోమిస్సకసన్ధి.
౨. నామకణ్డ
పుల్లిఙ్గ
౪౭. ‘‘జినవచనయుత్తం ¶ హీ’’తి సబ్బత్థాధికారో.
లిఙ్గఞ్చ నిపచ్చతే.
ధాతుప్పచ్చయవిభత్తివజ్జితమత్థయుత్తం సద్దరూపం లిఙ్గం నామ, జినవచనయోగ్గం లిఙ్గం ఇధ ఠపీయతి నిప్ఫాదీయతి చ.
౪౮. బుద్ధఇతి ¶ ఠితే –
తతో చ విభత్తియో.
తస్మా లిఙ్గా పరా విభత్తియో హోన్తి. చకారేన తాసం ఏకవచనాదిపఠమాదిసఞ్ఞా చ.
‘‘సి యో అం యో నా హి స నం స్మా హి స నం స్మిం సూ’’ తి విభత్తియో. సి యో ఇతి పఠమా, అం యో ఇతి దుతియా, నా హి ఇతి తతియా, స నం ఇతి చతుత్థీ, స్మా హి ఇతి పఞ్చమీ, స నం ఇతి ఛట్ఠీ, స్మిం సు ఇతి సత్తమీ.
లిఙ్గత్థే పఠమా.
యో ¶ కమ్మకత్తాదివత్తన్తరమప్పత్తో సస్సరూపట్ఠో సుద్ధో, సో లిఙ్గత్థో నామ, తస్సాభిధానమత్తే పఠమావిభత్తి హోతి. తస్సాపనియమే ఏకమ్హి వత్తబ్బే ఏకవచనం సి, వుచ్చతే నేనేతివచనం, ఏకస్సత్థస్స వచనం ఏకవచనం. ఏవం బహువచనం.
అతోత్వేవ.
సో.
అకారన్తా ¶ పరస్స సిస్స ఓ హోతి.
సరలోపో మాదేసప్పచ్చయాదిమ్హి సరలోపే తు పకతి.
అంఆదీసు పరేసు సరస్స లోపో హోతి, తస్మిం కతే తు క్వచాదినా అసవణ్ణే పత్తే పకతి హోతి.
నయే ¶ పరం యుత్తే. ఏవముపరి సరలోపాది. బుద్ధో.
బహుమ్హి వత్తబ్బే బహువచనం యో.
అతో వాత్వేవ.
సబ్బయోనీనమాఏ.
అకారన్తా పరేసం పఠమదుతియాయోనీనం యథాసఙ్ఖ్యం ఆఏ వా హోన్తి. బుద్ధా.
వాతి కిం. అగ్గయో.
౪౯. లిఙ్గత్థే ¶ పఠమాత్వేవ.
ఆలపనే చ.
అభిముఖీకరణమాలపనం, తదధికే లిఙ్గత్థే పఠమా హోతి.
‘‘ఆలపనే సి గసఞ్ఞో’’తి సిస్స గసఞ్ఞా. గేఇత్వేవ.
అకారా పితాద్యన్తానమా.
గే పరే అకారో పితుసత్థుఅత్తరాజాదీనమన్తో చ ఆత్తం యాతి.
‘‘ఆకారో వా’’తి గే పరే ఆకారస్స రస్సో వా.
సేసతో లోపం గసీపి.
సో సిం స్యా చ సఖాతో గస్సేవాత్యాదినిద్దిట్ఠేహఞ్ఞే అవణ్ణివణ్ణువణ్ణోకారన్తా సేసా, తేహి పరే గసీ లుప్యన్తే. హే - బుద్ధ, బుద్ధా. యో - బుద్ధా.
యం ¶ కరోతి, తం కమ్మం నామ. తత్థ దుతియా హోతి. అంబుద్ధం. యోస్స ఏ-బుద్ధే.
కత్తరి చ.
యో కరోతి, స కత్తా నామ. తత్థ తతియా హోతి. నా.
అతో నేన.
అకారా పరో నా ఏనం యాతి. బుద్ధేన.
హి.
సుహిస్వకారో ఏ.
సుహిసు ¶ పరేస్వకారస్స ఏ హోతి.
స్మాహిస్మిన్నం మ్హాభిమ్హి వా.
సబ్బసద్దేహి పరేసం స్మాహిస్మిన్నం యథాసఙ్ఖ్యం మ్హాభిమ్హిఇచ్చేతే వా హోన్తి. బుద్ధేభి, బుద్ధేహి.
యేన ¶ వా కయిరతే, తం కరణం నామ. తత్థ తతియా హోతి. సబ్బం కత్తుసమం.
యస్స దాతుకామో రోచతే, ధారయతే వా, తం సమ్పదానం నామ. తత్థ చతుత్థీ హోతి. స.
అతో వాత్వేవ.
ఆయ చతుత్థేకవచనస్స తు.
అకారా పరస్స చతుత్థేకవచనస్స ఆయో వా హోతి. బుద్ధాయ.
‘‘సాగమో ¶ సే’’తి సే సకారాగమో. బుద్ధస్స. నం.
దీఘన్త్వేవ.
సునంహిసు చ.
సునంహిసు పరేసు సరాదీనం దీఘో హోతి. చసద్దేన క్వచి న. బుద్ధానం.
యస్మాదపేతి, భయమాదత్తే వా, తదపాదానం నామ, తత్థ పఞ్చమీ హోతి. స్మా.
అతో ఆఏత్వేవ.
అకారా పరేసం స్మాస్మిన్నం ఆఏ వా హోన్తి. బుద్ధా, బుద్ధమ్హా, బుద్ధస్మా. బుద్ధేభి, బుద్ధేహి.
యస్స ¶ వా పరిగ్గహో, తం సామీ నామ. తత్థ ఛట్ఠీ హోతి. బుద్ధస్స. బుద్ధానం.
యోధారో, తమోకాసం నామ. తత్థ సత్తమీ హోతి. స్మిం-బుద్ధే, బుద్ధమ్హి, బుద్ధస్మిం. సు-బుద్ధేసు.
బుద్ధో బుద్ధ సుఖం దదాతి సరతో బుద్ధం తతో దుక్కరం,
కిం బుద్ధేన మహిద్ధయోపి మునయో బుద్ధేన జాతాసుఖీ;
బుద్ధస్సేవ మనం దదే పదమహం బుద్ధా లభేయ్యాచ్చుతం,
బుద్ధస్సిద్ధి న కిం కరే భవభవే భత్త్యత్థు బుద్ధే మమ.
౫౯. ఇతో ¶ పరం తతియాపఞ్చమీనఞ్చ చతుత్థీఛట్ఠీనఞ్చ సరూపత్తా పఞ్చమీఛట్ఠియో భీయో ఉపేక్ఖన్తే.
బ్రహ్మత్తసఖరాజాదితో త్వేవ.
స్యా చ.
బ్రహ్మాదితో సిస్స ఆ హోతి. అత్తా.
‘‘యోనమానో’’తి బ్రహ్మాదితో యోనం ఆనోత్తం. అత్తానో.
౬౧. హే - అత్త, అత్తా. యో, అత్తానో.
౬౨. ‘‘బ్రహ్మత్తసఖరాజాదితో ¶ అమాన’’న్తి బ్రహ్మాదితో అంవచనస్స ఆనం వా హోతి. అత్తానం, అత్తం. అత్తానో.
౬౩. అత్తేన, అత్తనా. పక్ఖే-జినవచనానురోధేన ఏనాభావో.
‘‘అత్తాన్తో ¶ హిస్మిమనత్తం’’తి హిమ్హి అత్తన్తస్స అనో. అత్తనేహి. ఏవం కరణే.
౬౪. ‘‘సస్స నో’’తి నోకారో. అత్తనో. అత్తానం.
౬౫. అమ్హతుమ్హన్తు రాజబ్రహ్మత్తసఖ సత్థుపితాదీహి స్మా నావ.
అమ్హాదితో స్మా నా ఇవ హోతి. అత్తనా.
౬౬. ‘‘తతో స్మిన్నీ’’తి స్మినో ని. అత్తని. ‘‘అనత్త’’న్తి భావనిద్దేసేన సుమ్హి చ అనో. అత్తనేసు.
౬౭. రాజా ¶ అత్తావ. నా.
సవిభత్తిస్స రాజస్సేత్వేవ.
నామ్హి రఞ్ఞా వా.
నామ్హి సవిభత్తిస్స రాజసద్దస్స రఞ్ఞా వా హోతి. రఞ్ఞా, రాజేన.
రాజస్స రాజు సునంహిసు చ.
సునం హిసు పరేసు రాజస్స రాజు హోతి, చకారేన క్వచి న.
‘‘సునంహిసు ¶ చేతి’’ దీఘే - రాజూభి, రాజూహి, రాజేభి, రాజేహి.
‘‘రాజస్స రఞ్ఞో రాజినో సే’’తి సే రఞ్ఞో రాజినో హోన్తి. రఞ్ఞో, రాజినో.
‘‘రఞ్ఞం నమ్హి వా’’తి నమ్హి రఞ్ఞం వా. రఞ్ఞం, రాజూనం, రాజానం.
౬౯. స్మాస్సనాతుల్యత్తా-నామ్హి ¶ రఞ్ఞా వా. రఞ్ఞా, రాజమ్హా, రాజస్మా.
౭౦. ‘‘స్మిమ్హి రఞ్ఞే రాజినీ’’తి స్మిమ్హి రఞ్ఞే రాజిని హోన్తి. రఞ్ఞే, రాజిని. రాజూసు, రాజేసు.
సవిభత్తిస్స న్తుస్సేత్వేవ.
‘‘ఆ సిమ్హీ’’తి సిమ్హి సవిభత్తిస్స న్తుస్స ఆ. గుణవా.
యోమ్హి పఠమేత్వేవ.
న్తుస్స న్తో.
పఠమే యోమ్హి సవిభత్తిస్స న్తుస్స న్తోకారో హోతి. గుణవన్తో.
సునంహిసు అత్తంత్వేవ.
న్తుస్సన్తో యోసు చ.
సునంహిసు, యోసు, చకారేన అఞ్ఞేసుపి పరేసు న్తుస్సన్తో అత్తం యాతి. గుణవన్తా.
౭౨. సవిభత్తిస్సేత్యధికారో ¶ . అంఇత్వేవ.
అవణ్ణో చ గే.
గే పరే సవిభత్తిస్స న్తుస్స అంఅఆ హోన్తి. హేగుణవం,గుణవ, గుణవా. యో - గుణవన్తో, గుణవన్తా.
౭౩. అత్తం – గుణవన్తం. గుణవన్తే.
౭౪. ‘‘తోతితా ¶ సస్మిం నాస్వీ’’తి సవిభత్తిస్స న్తుస్స నామ్హి తా, సే తోకారో, స్మిమ్హి తి చ వా. గుణవతా, గుణవన్తేన. గుణవన్తేభి, గుణవన్తేహి.
‘‘నమ్హి తం వా’’తి నమ్హి న్తుస్స తం వా. గుణవతం, గుణవన్తానం. స్మా నావ.
౭౬. గుణవతి, గుణవన్తే, గుణవన్తమ్హి, గుణవన్తస్మిం, గుణవన్తేసు.
‘‘సిమ్హి గచ్ఛన్తాదీనం న్తసద్దో అ’’న్తి న్తసద్దస్స అంవా, సిలోపో. గచ్ఛం, సిస్స ఓ – గచ్ఛన్తో.
గచ్ఛన్తాదీనం న్తసద్దోత్వేవ.
సేసేసున్తువ.
వుత్తం హిత్వా సేసేసు గచ్ఛన్తాదీనం న్తసద్దో న్తు ఇవ దట్ఠబ్బో. గచ్ఛన్తో, గచ్ఛన్తాఇచ్చాది.
సేసం గుణవన్తుసమం.
౭౮. గచ్ఛన్తాదయో ¶ నామ అన్తప్పచ్చయన్తా.
‘‘ఇవణ్ణువణ్ణా ఝలా’’తి ఇవణ్ణువణ్ణానం యథాసఙ్ఖ్యం ఝలసఞ్ఞా.
ఝలతో వాత్వేవ.
ఘపతో చ యోనం లోపో.
ఘపఝలతో యోనం లోపో వా హోతి.
యోసు కతనికారలోపేసు దీఘం.
కతో నికారో లోపో చ యేసం తేసు యోసు సరానం దీఘో హోతి. అగ్గీ. పక్ఖే-అత్తన్త్వేవ.
యో స్వకతరస్సో ఝో.
యోసు అకతరస్సో ఝో అత్తం యాతి. అగ్గయో. తథాలపనే.
ఝలపతో అం మో చ బిన్దుం యన్తి. అగ్గిం. అగ్గీ, అగ్గయో.
౮౧. అగ్గినా. దీఘే-అగ్గీభి, అగ్గీహి.
౮౨. ‘‘ఝలతో సస్స నో వా’’తి సస్స నోత్తం వా. అగ్గినో, అగ్గిస్స. అగ్గీనం.
౮౩. ‘‘ఝలతో చే’’తి స్మాస్స నా. అగ్గినా.
౮౪. అగ్గిమ్హి, అగ్గిస్మిం. అగ్గీసు.
౮౫. ఆది అగ్గీవ. స్మింనో పన ‘‘ఆదితో ఓ చే’’తి అం, ఓ చ వా. ఆది, ఆదో, ఆదిమ్హి, ఆదిస్మిం. ఆదీసు.
౮౬. దణ్డీ ¶ , సి.
‘‘అఘో రస్స’’మాదినా రస్సే సమ్పత్తే ‘‘న సిస్మిమనపుంసకానీ’’తి సిమ్హి అనపుంసకానం న రస్సో. సిలోపో, దణ్డీ, యోలోపే – దణ్డీ. పక్ఖే –
అఘో రస్సమేకవచనయోస్వపి చ.
ఏకవచనయోసు ఝలపా రస్సం యన్తి.
ఝతో కతరస్సాత్వేవ.
యోనం నో.
కతస్సా ఝతో యోనం నోత్తం హోతి. దణ్డినో.
౮౭. ‘‘ఝలపా రస్స’’న్తి గే పరే ఝలపానం రస్సో. హేదణ్డి. దణ్డీ, దణ్డినో.
౮౮. వా ¶ అంఇత్వేవ.
‘‘నం ఝతో కతరస్సా’’తి అంఇచ్చస్స నం వా. దణ్డినం, దణ్డిం. దణ్డీ, దణ్డినో.
౮౯. దణ్డినా. దణ్డీభి, దణ్డీహి.
౯౦. దణ్డినో, దణ్డిస్స. దణ్డీనం.
‘‘స్మిన్నీ’’తి స్మినో ని. దణ్డిని. దణ్డీసు.
వా యోనంత్వేవ.
‘‘లతో వో కారో చే’’తి లతో యోనం వోత్తం వా.
అత్తం అకతరస్సోత్వేవ.
వేవోసు లో చ.
వేవోసు అకతరస్సో లో అత్తం యాతి. భిక్ఖవో, పక్ఖే – యోలోప దీఘా. భిక్ఖూ.
‘‘అకతరస్సా లతో య్వాలపనస్స వేవో’’తి ఆలపనే యోస్స వేవోకారా, అత్తం. భిక్ఖవే, భిక్ఖవో, భిక్ఖూ.
౯౪. భిక్ఖుం. భిక్ఖవో, భిక్ఖూ. సేసం అగ్గీవ.
‘‘లతో ¶ వోకారో చే’’తీహ కారగ్గహణేన యోనం నోత్తం, చకారేన క్వచి వోనోనమభావోవ విసేసో. జన్తునో, జన్తుయో.
‘‘సత్థుపితాదీనమా సిస్మిం సిలోపో చే’’తి సత్థాద్యన్తస్స ఆ, సిలోపో చ. సత్థా.
సత్థుపితాదీనన్త్యధికారో.
అఞ్ఞేస్వారత్తం.
సితోఞ్ఞేసు సత్థాద్యన్తస్స ఆరో హోతి.
తతో యోనమో తు.
తతో ఆరతో యోనం ఓ హోతి. సత్థారో.
౯౮. సత్థారం. సత్థారే, సత్థారో.
౯౯. ‘‘నా ఆ’’తి ఆరతో నాస్స ఆ. సత్థారా. సత్థారేభి, సత్థారేహి.
సే ¶ సత్థాద్యన్తస్స ఉ హోతి సలోపో చ వా. సత్థు, సత్థునో, సత్థుస్స.
‘‘వా నమ్హీ’’తి నమ్హి ఆరో వా. సత్థారానం.
‘‘సత్థునాత్తఞ్చే’’తి నమ్హి సత్థాద్యన్తస్స అత్తం వా. దీఘేసత్థానం.
౧౦౧. ‘‘తతో స్మిమీ’’తి ఆరతో స్మినో ఇ. ‘‘ఆరో రస్సమీకారే’’తి ఇమ్హి ఆరస్స రస్సో. సత్థరి. సత్థారేసు. ఏవం నత్తాది.
౧౦౨. పితా ¶ సత్థేవ. ‘‘పితాదీనమసిమ్హీ’’తి సితోఞ్ఞేసు ఆరస్స రస్సోవ విసేసో. పితరో.
నమ్హి – పితూనన్తిపి హోతి. ఏవం భాతుప్పభుతయో.
౧౦౩. అభిభూ. రస్సే-అభిభువో. యోలోపేఅభిభూ. సేసం భిక్ఖూవ, రస్సోవ విసేసో.
౧౦౪. ఏవం ¶ సబ్బఞ్ఞూ. పుబ్బేవ యోనం నోకారో చ. సబ్బఞ్ఞునో, సబ్బఞ్ఞూ.
గావఇత్వేవ.
‘‘యోసు చే’’తి గోసద్దోకారస్స ఆవో, ‘‘తతో యోనమో తు’’తీహ తుసద్దేన యోనం ఓ. గావో. తథాలపనే.
అమ్హి పరే గోసద్దోకారస్స ఆవఅవా హోన్తి, చసద్దేన హినంవజ్జితేసు సేసేసుపి.
౧౦౭. ‘‘ఆవస్సు వా’’తి అమ్హి ఆవన్తస్స ఉత్తం వా, గాహ్వం, గావం, గవం. యో-గావో. గావేన, గవేన. గోభి, గోహి.
౧౦౮. ‘‘గావ సే’’తి సే ఓస్స ఆవో. గావస్స, గవస్స. ‘‘తతో న’’మాదో చకారేన నంఇచ్చస్స అం, ఓస్స అవో చ. గవం.
౧౦౯. ‘‘సుహినాసు ¶ చే’’తీహ చకారేన గోస్స గు చ. ద్విత్తే-గున్నం, గోనం. గావా, గవా, గావమ్హా, గవమ్హా, గావస్మా, గవస్మా. గోభి, గోహి.
౧౧౦. గావే, గవే, గావమ్హి, గవమ్హి, గావస్మిం, గవస్మిం. గావేసు, గవేసు, గోసు.
పుల్లిఙ్గా.
ఇత్థిలిఙ్గ
౧౧౧. కఞ్ఞా ¶ . సిలోపో.
‘‘ఆ ఘో’’తి ఇత్థియం ఆకారస్స ఘసఞ్ఞా. యో లోపే – కఞ్ఞా. పక్ఖే – కఞ్ఞాయో.
౧౧౨. ‘‘ఘతే చే’’తి గస్స ఏ. హే-కఞ్ఞే. కఞ్ఞా, కఞ్ఞాయో.
‘‘ఘతో నాదీన’’న్తి నాదేకవచనానమాయో. కఞ్ఞాయ. కఞ్ఞాభి, కఞ్ఞాహి.
ఘపేహి స్మినో యం వా హోతి. కఞ్ఞాయం, కఞ్ఞాయ. కఞ్ఞాసు.
౧౧౭. రత్తి ¶ , సిలోపో.
‘‘తే ఇత్థిఖ్యా పో’’తి ఇత్థియమివణ్ణువణ్ణానం పసఞ్ఞా. యోలోపదీఘా. రత్తీ. పక్ఖే – రత్తియో. తథాలపనే.
‘‘పతో యా’’తి నాదేకవచనానం యా. రత్తియా. రత్తీభి, రత్తీహి.
౧౨౧. రత్తియం, రత్తియా. రత్తీసు.
౧౨౨. నదీ ¶ . సేసం రత్తీవ. అఘత్తా రస్సోవ విసేసో.
౧౨౪. మాతు, ధీతు, దుహిత్వాదయో పితేవ.
కఞ్ఞఇతి ఠితే –
ఇత్థియమతో ఆపచ్చయో.
ఇత్థియం వత్తమానా అకారన్తతో ఆపచ్చయో హోతి. సరలోపపకల్యాది. కఞ్ఞా.
‘‘ధాతుప్పచ్చయవిభత్తి వజ్జితమత్థవం లిఙ్గ’’న్తి వచనతో పచ్చయన్తస్సాలిఙ్గత్తా తద్ధితాదిసుత్తే చకారేన నామమివ కతే – స్యాది. ఏవం ఈఇనీసు.
ఏవం అజా, ఏళకా, కోకిలా, అస్సా, మూసికా, బలాకా, మన్దా, జరాఇచ్చాది.
నదాదితో వా ఈ.
ఇత్థియం ¶ నదాదితో వా అనదాదితో వా ఈ హోతి. నదీ, నగరీ, కుమారీ, బ్రాహ్మణీ, తరుణీ, కుక్కుటీ, ఇత్థీ ఇచ్చాది.
‘‘మాతులాదీనమానత్తమీకారే’’తి ¶ ఈమ్హి మాతులాద్యన్తస్స ఆనో. మాతులానీత్యాది.
అనదాదితో వా ఈ. సఖీ, హత్థీ.
భవతో భోతో.
ఈమ్హి భవన్తస్స భోతో హోతి. భోతీ.
౧౨౭. ‘‘ణ ¶ వ ణికణేయ్య ణన్తూహీ’’తి ఈ. మానవీ, నావికీ, వేనతేయ్యీ, గోతమీ.
౧౨౮. ‘‘న్తుస్స తమీకారే’’తి న్తుస్స తో వా. గుణవతీ, గుణవన్తీ. ధితిమతీ, ధితిమన్తీ.
న్తస్స న్తుబ్యపదేసో. మహతీ, మహన్తీ.
౧౨౯. పతిభిక్ఖురాజీకారన్తేహి ఇనీ.
పత్యాదీహి ¶ ఈకారన్తేహి చ ఇత్థియం ఇనీ హోతి.
‘‘పతిస్సినీమ్హీ’’తి పత్యన్తస్స అత్తే సరలోపాదో తుకారేన లోపాభావో. ‘‘వా పరో అసరూపా’’తి ఇలోపో, దీఘో చ. గహపతానీ, భిక్ఖునీ, రాజినీ, మేధావినీ, తపస్సినీ, ధమ్మచారిణీ, భయదస్సావినీ, భుత్తావినీత్యాది.
ఇత్థిలిఙ్గా.
నపుంసకలిఙ్గ
౧౩౦. చిత్త ¶ , సి.
నపుంసకేహి అతో నిచ్చన్తేవ.
సిం.
అకారన్తేతి నపుంసకేహి సిస్స నిచం అం హోతి. చిత్తం.
యోనం ని నపుంసకేహిత్వేవ.
అతో నిచ్చం.
అకారన్తేహి న పుంసకేహి యోనం నిచ్చం ని హోతి, నిస్స ఆ. చిత్తా. పక్ఖే – యోస్వాదినా దీఘే – చిత్తాని.
౧౩౧. గలోపే – హే – చిత్త. చిత్తా, చిత్తాని.
౧౩౨. చిత్తం ¶ . నిస్స ఏ – చిత్తే, చిత్తాని. సేసం బుద్ధోవ.
నా వాత్వేవ.
మనాదితో స్మిన్నానం ఇఆ వా హోన్తి.
స సరే వాగమో.
విభత్యాదేసే సరే పరే మనాదితో సాగమో వా హోతి. మనసా.
మనాదితో సస్స ఓ హోతి, చసద్దేన స్మాస్స ఆ చ. మనసో, మనసా.
౧౩౬. మనసి ¶ . సేసం చిత్తంవ.
మనం సిరం ఉరం తేజం, రజం ఓజం వయం పయం;
యసం తపం వచం చేతం, ఏవమాది మనోగణో.
౧౩౮. గుణవన్తు ¶ , సి.
‘‘అం నపుంసకే’’తి సిమ్హి సవిభత్తిస్స న్తుస్స అం. గుణవం. న్తుస్స త్తే – గుణవన్తాని.
౧౩౯. యోతోఞ్ఞం పుమేవ. ఏవం గచ్ఛం.
వాత్వేవ.
‘‘యోనన్ని నపుంసకేహీ’’తి యోనం ని వా. అట్టీని. ఝత్తా యోలోపే – అట్ఠీ. తథాలపనే.
౧౪౧. అట్ఠిం, అట్ఠీని, అట్ఠీ. సేసం అగ్గీవ.
అఘత్తా రస్సో, దణ్డి. యోతోఞ్ఞం పుమేవ.
నపుంసకలిఙ్గా.
పుమిత్థిలిఙ్గ
౧౪౪. పుమిత్థిలిఙ్గా ¶ – ఘట, కట, యట్ఠి, ముట్ఠి, సిన్ధు, రేణుప్పభుతయో ద్విపద చతుప్పద జాతివాచినో చ.
యథా – ఘటో, ఈపచ్చయే-ఘటీ. ఏసో యట్ఠి, ఏసా యట్ఠిచ్చాది.
ద్విపదజాతివాచినో యథా – ఖత్తియో. ఆపచ్చయే- ఖత్తియా, సమణో, ఈమ్హి-సమణీఇచ్చాది.
చతుప్పదజాతివాచినో యథా – గజో, ఆ-గజా, బ్యగ్ఘో, ఈమ్హి - బ్యగ్ఘీఇచ్చాది.
పుమనపుంసకలిఙ్గ
౧౪౫. పుమనపుంసకలిఙ్గా ¶ – ధమ్మ, కమ్మ, బ్రహ్మ, కుసుమ సఙ్గమ, పదుమ, అస్సమ, విహార, సరీర, సువణ్ణ, వణ్ణ, కహాపణ, భవన, భువన, యోబ్బన, భుసన, ఆసన, సయన, ఓదన, ఆకాస, ఉపవాస, మాస, దివస, రస, థల, ఫల, రట్ఠ అమ్బు, మధ్వాదయో.
ఇత్థినపుంసకలిఙ్గ
౧౪౬. ఇత్థినపుంసకలిఙ్గా – నగర, అచ్చిప్పముఖా.
సబ్బలిఙ్గ
౧౪౭. సబ్బలిఙ్గా ¶ – తట పుట పత్త మణ్డల కలసా దయో, నామీకతా, సబ్బనామాని చ. యథా – తటో, ఈమ్హి – తటీ, తటమిచ్చాది.
నామీకతా యథా – దేవదత్తో, ఆ – దేవదత్తా దేవదత్తమిచ్చాది.
సబ్బనామ
౧౪౮. సబ్బ ¶ , కతర, కతమ, ఉభయ, ఇతర, అఞ్ఞ, అఞ్ఞతర, అఞ్ఞతమ, పుబ్బ, పర, అపర, దక్ఖిణ, ఉత్తర, ఏక, య, త, ఏత, ఇమ, అము, కిం, తుమ్హ, అమ్హ-ఇతి సబ్బనామాని.
సబ్బో బుద్ధోవ. అయం విసేసో.
యోత్వేవ.
సబ్బనామకారతే పఠమో.
సబ్బాదీనమకారతో ¶ పరో పఠమో యో ఏత్తం యాతి సబ్బే.
‘‘తయో నేవ చ సబ్బనామేహీ’’తి నిసేధా సస్మాస్మిన్నం ఆయ ఆ ఏ న హోన్తి. సబ్బస్స.
సబ్బతో నం సంసానం.
సబ్బాదితో నంఇచ్చస్స సంసానం హోన్తి.
అకారో ఏఇత్వేవ.
సబ్బనామానం నమ్హి చ.
నమ్హి సబ్బాదీనమకారస్స ఏ హోతి. సబ్బేసం, సబ్బేసానం.
౧౪౯. ఇత్థియం ¶ ఆ, సబ్బా కఞ్ఞావ. అయం విసేసో. వాత్వేవ.
ఘపతో స్మింసానం సంసా.
ఘపసఞ్ఞాతో సబ్బాదితో స్మింసానం సంసా వా హోన్తి.
‘‘సంసాస్వేకవచనేసు చే’’తి సాగమో.
ఘో రస్సం.
ఏకవచనసంసాసు ఘో రస్సం యాతి. సబ్బస్సా, సబ్బాయ. సబ్బాసం, సబ్బాసానం. సబ్బస్సం, సబ్బాయం. సబ్బాసు.
నేతాహి స్మిమాయయా.
ఘపఞ్ఞాహి సబ్బాదీహి స్మినో ఆయ యా న హోన్తి.
౧౫౦. నపుంసకే ¶ – సబ్బం. సబ్బాని. ఏవం దుతియా.
సబ్బాదయో నపుంసకే తతియాదీసు సకసకపుమసమా. ఏవం య - సద్దన్తా.
౧౫౧. పుబ్బపరాపరేహి తు స్మినో ‘‘యదనుపపన్నా నిపాతనా సిజ్ఝన్తీ’’తి అనిత్థియం ఏ వా. పుబ్బే, పుబ్బస్మింఇచ్చాది.
ఏకసద్దో సఙ్ఖ్యాతుల్యఞ్ఞాసహాయత్థో. యదా సఙ్ఖ్యత్థో, తదేకవచనో, అఞ్ఞత్థ సబ్బవచనో చ.
యాదీనమాలపనం నత్థి.
సిమ్హి సం అనపుంసకస్సేత్వేవ.
ఏతతేసం తో.
సిమ్హి అనపుంసకానం ఏతతఇచ్చేతేసం తకారస్స స హోతి. సో.
తస్స వా నత్తం సబ్బత్థ.
తిలిఙ్గేసు ¶ సబ్బాదీనం తకారస్స నో వా హోతి. నే, తే. సేసం సబ్బసమం, నత్తంవ విసేసో.
౧౫౩. ఇత్థియం – సా, నా, నాయో, తా, తాయోఇచ్చాది.
వాత్వేవ.
తతో సస్స స్సాయ.
తాఏతాఇమాహి సస్స స్సాయో వా హోతి.
సంసాస్వేకవచనేసు ఇఇత్వేవ.
తస్సా వా.
ఏకవచనసంసాసు తాసద్దస్స ఆ ఇత్తం వా యాతి. తిస్సాయ, తిస్సా, తస్సా, తాయ. తాసం, తాసానం. తిస్సం, తస్సం, తాయం. తాసు.
౧౫౪. నపుంసకే ¶ – తంఇచ్చాది.
సంసాస్వేకవచనేస్వేత్వేవ.
ఏతిమాసమి.
ఏకవచనసంసాసు ఏతాఇమానమన్తస్స ఇ హోతి. ఏతిస్సాయ, ఏతిసా, ఏతాయ. ఏతాసం, ఏతాసానం. ఏతిస్సం, ఏతస్సం, ఏతాయం. ఏతాసు. సేసం సబ్బావ.
‘‘అనపుంసకస్సాయం సిమ్హీ’’తి ఇమస్స అయం. సిలోపో. అయం, ఇమే. ఇమం, ఇమే.
‘‘అనిమి నామ్హి చే’’తి ఇమస్స అనో, ఇమి చ. అనేన, ఇమినా.
‘‘సబ్బస్సిమస్సే వా’’తి సునంహిసు ఏవా. ఏహి, ఇమేహి. వా స్మాసస్మింసంసాస్వత్తన్త్వేవ.
ఇమసద్దస్స చ.
సస్మాస్మింసంసాసు ¶ ఇమస్స అత్తం వా హోతి. అస్స, ఇమస్స. ఏసం, ఏసానం, ఇమేసం, ఇమేసానం. అస్మా, ఇమమ్హా, ఇమస్మా. ఏహి, ఇమేహి. అస్మిం, ఇమమ్హి, ఇమస్మిం. ఏసు, ఇమేసు.
అత్తపక్ఖే – ‘‘న తిమేహి కతాకారేహీ’’తి స్మాస్మిన్నం మ్హామ్హి న సిజ్ఝన్తే.
౧౫౯. ఇత్థియం – అయం. సేసం ఏతావ, సంసాస్వత్తంవ విసేసో.
౧౬౦. నపుంసకే – సవిభత్తిస్స వాత్వేవ.
‘‘ఇమస్సిదమంసిసు నపుంసకే’’తి ఇమస్స ఇదం వా. ఇదం, ఇమం ఇమే, ఇమాని. ఏవం దుతియా.
౧౬౧. అము ¶ , సి.
వా అనపుంసకస్స సిమ్హిత్వేవ.
‘‘అముస్స మో సం’’తి మస్స సో వా, సిలోపో. అసు.
‘‘సబ్బతో కో’’తి సబ్బనామతో కాగమో. ‘‘సో’’తి ఓ, అముకో, పక్ఖే – అము. అమూ, అముయో.
పుబ్బేవ ¶ యోనం వోకారో న. అముం. అమూ, అముయో. సేసం భిక్ఖూవ సబ్బాదికారియాఞ్ఞత్ర.
౧౬౨. ఇత్థియం – అసు. సేసం యాగుసమం. విసేసోయం – అముస్సా, అముయా. అమూసం, అమూసానం. అముస్సం, అముయం. అమూసు.
౧౬౩. నపుంసకే – సవిభత్తిస్స అంసిసు నపుంసకేత్వేవ.
‘‘అముస్సాదుం’’తి అదుం. అదుం. అమూ, అమూని. ఏవం దుతియా.
౧౬౪. ‘‘సేసేసు చే’’తి సబ్బత్థ కిస్స కో. కో, కా, కం ఇచ్చాది. లిఙ్గత్తయే సబ్బసమో.
౧౬౫. తుమ్హ ¶ , సి, అమ్హ, సి.
సవిభత్తిస్స తుమ్హమ్హానన్త్యధికారో.
త్వమహం సిమ్హి చ.
సిమ్హి సవిభత్తీనం తుమ్హమ్హానం త్వం అహం హోన్తి. చసద్దేన తుమ్హస్స తువం చ. త్వం, తువం, అహం. యో – తుమ్హే.
‘‘మయం యోమ్హి పఠమే’’తి అమ్హస్స మయం హోతి. మయం.
౧౬౬. ‘‘తంమమమ్హీ’’తి అమ్హి తం మం హోన్తి.
‘‘తవం మమఞ్చ నవా’’తి అమ్హి తవం మమఞ్చ నవా.
‘‘తుమ్హస్స తువం త్వమమ్హీ’’తి తుమ్హస్స తువం, త్వఞ్చ. తం, తవం, తువం, త్వం, మం, మమం.
ఆకన్త్వేవ.
‘‘వా యోప్పఠమో’’తి దుతియాయోస్స ఆకం వా. తుమ్హాకం, తుమ్హే. అమ్హాకం, అమ్హే.
౧౬౭. ‘‘నామ్హి తయా మయా’’తి నామ్హి తయా మయా హోన్తి. ‘‘తయాతయీనం తకారో త్వత్తంవా’’తి తస్స త్వో వా. త్వయా, తయా, మయా. తుమ్హేహి, అమ్హేహి.
౧౬౮. ‘‘తవ ¶ మమ సే’’తి సే తవ మమ హోన్తి.
‘‘తుయ్హం మయ్హం చే’’తి సే తుయ్హం మయ్హఞ్చ.
‘‘సస్సం’’తి సస్స అం వా.
‘‘అమ్హస్స మమం సవిభత్తిస్స సే’’తి సే అమ్హస్స మమం చ. తవ, తుయ్హం, తుమ్హం, మమ, మయ్హం, అమ్హం, మమం.
‘‘తుమ్హమ్హేహి నమాకం’’తి నంవచనస్స ఆకం. తుమ్హాకం, అమ్హాకం. స్మానావ.
౧౬౯. ‘‘తుమ్హామ్హానం తయి మయీ’’తి స్మిమ్హి తయి మయి హోన్తి. త్వే కతే - త్వయి, తయి, మయి, తుమ్హేసు, అమ్హేసు. లిఙ్గత్తయే సమం.
పదతో దుతియా చతుత్థీ ఛట్ఠీసు వోనో.
అత్థజ్జోతకా వణ్ణా పదం, దుతియా చతుత్థీ ఛట్ఠీ బహువచనేసు పరేసు పదస్మా పరేసం సవిభత్తీనం తుమ్హామ్హానం వోనోకారా నవా హోన్తి.
రక్ఖతు ¶ వో, పస్సతు నో, దదాతి వో, దదాహి నో, సద్ధా వో, సత్థా నో.
నవాతి కిం, ఏసో అమ్హాకం సత్థా.
‘‘తేమేకవచనేసు చే’’తి చతుత్థీఛట్ఠేకవచనేసు తే మే హోన్తి. దదామి తే, దదాహి మే, ఇదం తే, అయం మే.
‘‘నఅమ్హీ’’తి ¶ అమ్హి నిసేధో. పస్సేథ తం, అజిని మం.
‘‘వా తతియే చే’’తి తతియేకవచనే తే మే వా హోన్తి. కతం తే తయా వా. కతం మే మయా వా.
‘‘బహువచనేసు వోనో’’తి తతియాబహువచనేసు వో నో హోన్తి. బహువచనే పఠమే యోమ్హి చ. కతం వో, కతం నో, గామం వో గచ్ఛేయ్యాథ, గామం నో గచ్ఛేయ్యామ.
సఙ్ఖ్యా
ఏకసద్దో సబ్బనామేసు వుత్తో.
౧౭౩. ద్వాదయో ¶ అట్ఠారసన్తా బహువచనన్తా.
సవిభత్తిస్స, ఇత్థిపుమనపుంసకసఙ్ఖ్యన్తి చాధికారో.
‘‘యోసు ద్విన్నం ద్వే చే’’తి ద్విస్స ద్వే హోతి. ద్వే, ద్వే, ద్వీభి, ద్వీహి.
నో చ ద్వాదితో నమ్హి.
నమ్హి ద్వాదితో నకారాగమో హోతి. ద్విన్నం, ద్వీసు, లిఙ్గత్తయే సమం.
౧౭౪. తిచతున్నం తిస్సో చతస్సో తయో చత్తారో తీణి చత్తారి.
యోసు ఇత్థిపుమనపుంసకేసు సవిభత్తీనం తిచతున్నం తిస్సో చతస్సో ఆదయో హోన్తి. తయో, తయో, తీభి, తీహి, తిన్నం.
‘‘ఇణ్ణమిణ్ణన్నం తీహి సఙ్ఖ్యాహీ’’తి తిసద్దతో నంఇచ్చస్స ఇణ్ణం ఇణ్ణన్నం చ. తిణ్ణం, తిణ్ణన్నం, తీసు.
౧౭౫. ఇత్థియం-తిస్సో ¶ , తిస్సో, తీభి, తీహి.
‘‘నో చా’’దో చకారేన నమ్హి స్సంఆగమో, వగ్గన్తేతిస్సనం, తీసు.
౧౭౬. నపుంసకే-తీణి, తీణి, తీహి.
‘‘ఓసరే చే’’తీహ చకారేన యోసు ఉస్స ఉరో. ‘‘తతో యోనమోతూ’’తీహ తుకారేన యోనం ఓ. చతురో. ఏవం దుతియా. చతూహి, చతున్నం, చతూసు.
౧౭౮. ఇత్థియం ¶ , చతస్సో, చతస్సో, చతూహి. పుబ్బేవ స్సంఆగమో. యదాదినా ఉస్స అత్తం. చతస్సన్నం, చతూసు.
౧౭౯. నపుంసకే, చత్తారి, చత్తారి.
౧౮౦. ‘‘పఞ్చాదీన మకారో’’తి యోసు సవిభత్తిస్స పఞ్చాద్యన్తస్స అత్తం. పఞ్చ, పఞ్చ.
‘‘పఞ్చాదీన మత్తం’’తి సునంహిసు పఞ్చాద్యన్తస్స అత్తం. ఏదీఘానమపవాదోయం. పఞ్చహి, పఞ్చన్నం, పఞ్చసు. లిఙ్గత్తయే సమం.
౧౮౧. ఏవం ఛ సత్త అట్ఠ నవ దసాదయో అట్ఠారసన్తా.
౧౮౨. వీసత్యాదయో ¶ ఆనవుతియా ఇత్థిలిఙ్గా ఏకవచనన్తా, వీసతి రత్తీవ. ఏవం తింసతి.
చత్తాలీసం పఞ్ఞాసం సద్దేహి పరాసం సబ్బాసం విభత్తీనం ‘‘సబ్బాసమా’’దోతీహ ఆదిసద్దేన లోపో, సట్ఠి వీసతీ వ. ఏవం సత్తతి అసీతి నవుతి.
సతం నపుంసకమేకవచనన్తం. ఏవం సహస్సాది.
కోటి వీసతీవ.
౧౮౩. రాసిభేదే ¶ తు సబ్బత్థ బహువచనమ్పి. యథా-ద్వేవీసతియో బుద్ధదన్తా. తిస్సో వీసతియో దినఘటికా. ఏవమఞ్ఞత్ర.
ఏసేసో ఏతన్తిప్పసిద్ధి, లోకస్స హోతి యత్థత్థేసు.
థీపుమనపుంసకానిత్యుచ్చన్తే, తానిమాని లోకేనాత్థా.
అలిఙ్గ
క్వచి తో పఞ్చమ్యత్థే.
లిఙ్గతో పఞ్చమ్యత్థే క్వచి తోప్పచ్చయో హోతి.
‘‘త్వాదయో విభత్తిసఞ్ఞాయో’’తి తోప్పభుతిదాన్యన్తానం విభత్తిసఞ్ఞా. తస్మా తదన్తానమ్పి విభత్యన్తత్తా పదత్తం సిద్ధన్తి న పున విభత్తి. చోరస్మా చోరతో. ఏవం పితితో, ఏత్థ ‘‘పితాదీన మసిమ్హి’’ త్యత్రాసిమ్హిగ్గహణేన తోమ్హి పితాదీనం ఉస్స ఇ.
ఇమస్సి థన్దానిహతోధేసు చ.
థంఆదీసు పరేసు ఇమస్స ఇ హోతి. ఇతో.
‘‘సబ్బస్సేతస్సాకారో వా’’తి తోథేస్వేతస్స అత్తం వా, అతో, ఏత్తో. పక్ఖే- ‘‘సరలోపా’’దినా అకారలోపో.
‘‘త్రతోథేసు ¶ చే’’తి కిస్స కు. కుతో.
‘‘క్వచి తో’’తి సుత్తద్విధాకరణేన సత్తమ్యత్థే చ తో హోతి, ఆదిస్మిం, ఆదితో.
౧౮౫. ‘‘త్రథ ¶ సత్తమియా సబ్బనామేహీ’’తి సత్తమ్యత్థే త్రథప్పచ్చయా హోన్తి. సబ్బస్మిం, సబ్బత్ర, సబ్బత్థ, ద్విత్తం. ఏవం అత్ర, అత్థ. ఏత్థ ‘‘త్రే నిచ్చ’’న్తి పుబ్బే ఏతస్స అ. కుత్ర, కుత్థ.
‘‘సేసేసు చే’’తి కాదేసే-కత్థ.
౧౮౬. ‘‘కిస్మా వో చే’’తి వప్పచ్చయో. ‘‘కిస్స క వేచే’’తి కో, కకారాకారలోపో. క్వ.
౧౮౭. ‘‘హిం హం హిఞ్చన’’న్తి కస్మా హిం ఆదిపచ్చయా. ‘‘కు హిం హంసు చే’’తి కిస్స కు. చకారేన హిఞ్చనం దాచనంసు చ. కుహిం, కుహం, కుహిఞ్చనం.
౧౮౮. ‘‘తమ్హా చే’’తి హింహం. తహిం, తహం.
౧౯౦. ‘‘ఇమస్మా ¶ హధా చే’’తి హధా. ఇహ, ఇధ.
౧౯౧. ‘‘సబ్బతో ధీ’’తి ధి. సబ్బధి.
‘‘కింసబ్బఞ్ఞేకయకుహి దాదాచన’’న్తి కిం ఆదితో దా, దాచనం చ. కస్మిం కాలే కదా, కుదాచనం.
‘‘సబ్బస్స సో దామ్హి వా’’తి సబ్బస్స సో వా. సదా, సబ్బదా.
౧౯౩. ‘‘తమ్హా దాని చే’’తి దాని, దా చ. తదాని, తదా.
౧౯౪. యదాదినా ఇమసద్దా, సమానాపరేహి చ యథాసఙ్ఖ్యం జ్జ జ్జుప్పచ్చయా, ఇమ, సమానానం అ, సా చ. అజ్జ, సజ్జు, అపరజ్జు.
౧౯౫. ‘‘ఇమస్మా ¶ రహిధునాదాని చే’’తి రహ్యాదిప్పచ్చయా. ‘‘ఏత రహిమ్హీ’’తి ఇమస్స ఏతో. ఏతరహి.
‘‘అ ధునామ్హి చే’’తి ఇమస్స అ. అధునా, ఇదాని.
సబ్బాసమావుసోపసగ్గనిపాతాదీహి చ.
ఏతేహి పరా సబ్బా విభత్తీ లుప్యన్తే. త్వం ఆవుసో, తుమ్హే ఆవుసో.
ఉపసగ్గనిపాత
ప ¶ పరా ని నీ ఉ దు సం వి అవ అను పరి అధి అభి పతి సు ఆ అతి అపి అప ఉప ఏతే వీసత్యుపసగ్గా.
చ న వ వా మా హి ధి చి కు తు ను చే రే హే స్వే వే వో ఖో నో తో యం నం తం కిం హన్ద కిర ఏవ కీవ యావ తావ వత వథ అథ అఙ్గ ఇఙ్ఘ తగ్ఘ ఆమ నామ నూన పున పన ఆహ సహ సక్కా లబ్భా హేట్ఠా ఆరా దూరా దివా నవా వినా నానా అద్ధా ముధా మిచ్ఛా పచ్ఛా ఆవి సక్ఖి సచ్చి సచ్ఛి బహి యది ఇతి కిన్తి అత్థి సోత్థి ఖలు నను కిము అస్సు యగ్ఘే సచే హవే సువే అరే పురే నమో తిరో అధో అథో అహో రహో హీయో భీయో అన్తో పాతో సుదం కల్లం ఏవం ధువం అలం హలం సయం సాయం సమం సామం కామం పారం ఓరం చిరం హురం అహం సహం ఉచ్చం నీచం సకిం సద్ధిం, అథవా అన్తరా ఆరకా బాహిరా బహిద్ధా యావతా తావతా సమన్తా సామన్తా ఆమన్తా సమ్ముఖా చరహి తరహి సమ్పతి ఆయతి ఉపరి యావదే తావదే తిరియం సనికం ససక్కం ఏత్తావతా పరమ్ముఖా కిత్తావతా ఏతరహి అఞ్ఞదత్థు సేయ్యథిదం అప్పేవనామ భీయోసోమత్తాయ ఇచ్చాదయో నిపాతా.
౧౯౮. సదిసా ¶ యే తిలిఙ్గేసు, సబ్బాసు చ విభత్తీసు.
వచనేసు చ సబ్బేసు, తే నిపాతాతి కిత్తితా.
యథా ¶ – ఉచ్చం రుక్ఖో, లతా, ఘరం వా, ఉచ్చం రుక్ఖో. హే రుక్ఖ, రుక్ఖం, రుక్ఖేన, రుక్ఖస్స, రుక్ఖస్మా, రుక్ఖే వా ఇచ్చాది. ఉచ్చం రుక్ఖో, రుక్ఖా వా ఇచ్చాది. ఏవం లతా, ఘరాని.
ఉభయేసు విభత్యత్త -
క్రియదేస సమయ దిసాగుణత్థేహి;
సబ్బాపి యథాయోగం,
విభత్తియోఞ్ఞేహి తుప్పఠమా.
తం యథా – అధిఅన్తోసద్దేహి సత్తమీ. సయంసద్దా తతియా, ఛట్ఠీ చ. నమోసద్దా పఠమా, దుతియా చ. పారంసద్దా సత్తమీ. దివాసద్దా పఠమా, దుతియా, సత్తమీ చ. హేట్ఠాసద్దా సత్తమీ. ఉచ్చంసద్దా సబ్బాపి. పసద్దా చ చసద్దా చ పఠమా, హేసద్దా ఆలపనే పఠమా. తథాఞ్ఞేహిపి.
౨౦౦. ఉపసగ్గా ¶ సబ్బేపి సద్దన్తరేన సహ పయుజ్జన్తే. నిపాతా తు కేచి విసుమ్పి. యథా – పహారో, పహరతి, సా చ సో చ భాసతి వా కరోతి వా, సోత్థిత్యాది.
౨౦౧. ఏకేకలిఙ్గం ¶ ద్విలిఙ్గం, తిలిఙ్గం చాప్యలిఙ్గికం.
చతుధేతి నామం నామం, నమత్యత్థన్తి కిత్తితం.
నామికం.
౩. సమాసకణ్డ
సమాసలక్ఖణాది
౨౦౨. నామానం ¶ సమాసో యుత్తత్థోత్యధికారో. సమాసోతి భిన్నత్థానం పదాన మేకత్థతా. యుత్తత్థోతి అఞ్ఞమఞ్ఞసమ్బన్ధత్థో.
విభాసాత్యధికాతబ్బం ¶ వాక్యత్థం.
కమ్మధారయసమాస
౨౦౩. ‘‘మహన్తో చ సో వీరో చా’’తి వాక్యే –
ద్విపదే తుల్యాధికరణే కమ్మధారయో.
భిన్నప్పవత్తినిమిత్తా ¶ సద్దా ఏకస్మిం వత్థుని పవత్తా తుల్యాధికరణా, విసేసనవిసేసస్సభూతా సమానాధికరణా ద్వే పదా యదా సమస్యన్తే, తదా సో సమాసో కమ్మధారయో
నామ ¶ , ఇధ వా సమాససుత్తాని సఞ్ఞాద్వారేన సమాసవిధాయకాని.
అగ్గహితవిసేసనా ¶ బుద్ధి విసేస్సమ్హి న ఉప్పజ్జతీతి విసేసనం పుబ్బం హోతి, సమాసేనేవ తుల్యాధికరణత్తస్స వుత్తత్తా తప్పకాసనత్థం పయుత్తా సమాసతో అతిరిత్తా చ సో ఇచ్చేతే ‘‘వుత్తట్ఠానమప్పయోగో’’తి ఞాయా నప్పయుజ్జన్తే. ఏవమఞ్ఞత్ర.
తేసం విభత్తియో లోపా చ.
తేసం యుత్తత్థానం సమాసానం పుబ్బుత్తరపదానం విభత్తీ లుప్యన్తే, చకారేన క్వచి న.
తతో మహన్త వీర ఇతి చ రూపప్పసఙ్గే –
పకతి చస్స సరన్తస్స.
విభత్తీసు ¶ లుత్తాసు సరన్తస్స పుబ్బభూతస్స, పరభూతస్స చ అస్స సమాసపదస్స పకతి హోతీతీహ లుత్తాకారా పునానీయన్తే.
తతో మహన్త వీరఇతి ఠితే –
‘‘మహతం ¶ మహా తుల్యాధికరణే పదే’’తి మహన్తస్స మహా.
తద్ధిత సమాస కితకా నామంవాతవేతునాదీసు చ.
తద్ధితాదయో నామం ఇవ దట్ఠబ్బా తవేప్పభుతిపచ్చయే వజ్జేత్వా.
తతో ¶ వత్తిచ్ఛాయ స్యాది. మహావీరో, మహావీరాఇచ్చాది.
౨౦౪. కమ్మధారయో ¶ ద్వన్దో చ, తప్పురిసో చ లాభినో.
తయో పరపదే లిఙ్గం, బహుబ్బీహి పదన్తరే.
౨౦౫. రత్తా చ సా పటీ చాతి రత్తపటీ, మహన్తీ చ సా సద్ధా చాతి మహాసద్ధా. ఏత్థ ‘‘కమ్మధారయసఞ్ఞే చే’’తి పుబ్బపదే పుమేవ కతే ఆఈపచ్చయానం నివుత్తి.
౨౦౬. నీలఞ్చ తం ఉప్పలఞ్చాతి నీలుప్పలం, సత్థీవ సత్థి, సత్థి చ సా సామా చాతి సత్థిసామా. ముఖమేవ చన్దో ముఖచన్దో.
విసేసనవిసేస్సానం ¶ యథేచ్ఛత్తా క్వచి విసేసనం పరం హోతి, ఖత్తియభూతోఇచ్చాది, ఇచ్ఛా చ యథాతన్తి.
ఉభే తప్పురిస సమాస
౨౦౭. నసద్దా సి, తస్స లోపో. న సురో అసురో.
ఏత్థ కమ్మధారయే కతే – ‘‘ఉభే తప్పురిసా’’తి తప్పురిససఞ్ఞా. ‘‘అత్తన్నస్స తప్పురిసే’’తి నస్స అ. న అస్సో అనస్సో. ఏత్థ ‘‘సరే అన’’తి నస్స అన.
౨౦౮. ‘‘నామానం ¶ సమాసో’’తి సుత్తే ద్విధాకతే అయుత్తత్థానమ్పి క్వచి సమాసో. న పున గేయ్యా అపునగేయ్యా గాథేత్యాది. ఏత్థ గేయ్యేన సమ్బన్ధో న-సద్దో అయుత్తత్థేనాపి పునేన యోగవిభాగబలా సమస్యతే.
దిగుసమాస
౨౦౯. తయో ¶ లోకా సమాహటా తిలోకం.
ఏత్థ ‘‘సఙ్ఖ్యాపుబ్బో దిగూ’’తి కమ్మధారయస్స దిగుసఞ్ఞా. ‘దిగుస్సేకత్తం’’తి ఏకత్తం, నపుంసకత్తఞ్చ.
సుద్ధతప్పురిససమాస
౨౧౦. తప్పురిసా ¶ త్వేవ.
అమాదయో పరపదేహి.
దుతియన్తాదయో పరపదేహి నామేహి యదా సమస్యన్తే, తదా సో సమాసో తప్పురిసో నామ.
గామం ¶ గతో గామగతో.
‘‘పస్స వాసిట్ఠ గామం, గతో తిస్సో సావత్థిం’’త్య త్రాయుత్తత్థతాయ న సమాసో. తథా ఞ్ఞత్ర ఞేయ్యం.
౨౧౧. రఞ్ఞా ¶ హతో రాజహతో.
కిచ్చన్తేహి భీయో అధికత్థవచనే.
తబ్బ, అనీయ, ణ్య, తేయ్య, రిచ్చప్పచ్చయా కిచ్చా. థుతినిన్దత్థమజ్ఝారోపితత్థం వచనం అధికత్థవచనం. సోణలేయ్యో కూపోఇచ్చాది. సోణేహి యథా లియ్హతే, తథా పుణ్ణత్తా థుతి. తేహి ఉచ్ఛిట్ఠత్తా నిన్దా చ.
దధినా ఉపసిత్తం భోజనం దధిభోజనం, సమాసపదేనేవ ఉపసిత్తక్రియాయ కథనా నత్థేత్థాయుత్తత్థతా. ఉపసిత్తసద్దాప్పయోగో పుబ్బేవ.
౨౧౨. కరణే ¶ తు-అసినా కలహో అసికలహో.
౨౧౩. బుద్ధస్స దేయ్యం బుద్ధద్దేయ్యం, పరస్సపదం, ఏత్థ విభత్యలోపో. ఏవం అత్తనోపదమిచ్చాది.
౨౧౪. చోరస్మా ¶ భయం చోరభయం. ఏవం బద్ధనముత్తోచ్చాది.
‘‘బ్రాహ్మణస్స కణ్హా దన్తా’’ ఇచ్చత్ర దన్తాపేక్ఖా ఛట్ఠీతి కణ్హేన సమ్బన్ధాభావా న సమాసో. యదా తు కణ్హా చ తే దన్తా చేతి కమ్మధారయో, తదా ఛట్ఠీ కణ్హదన్తాపేక్ఖాతి బ్రాహ్మణకణ్హదన్తాతి సమాసో హోతేవ.
౨౧౬. ‘‘రఞ్ఞో ¶ మాగధస్స ధన’’ న్త్యత్ర రఞ్ఞోతి ఛట్ఠీ ధన మపేక్ఖతే, న మాగధం. రాజా ఏవ మాగధసద్దేన వుచ్చతేతి భేదాభావా సమ్బన్ధాభావోతి తుల్యాధికరణేన మాగధేన సహ రాజా న సమస్యతే. ద్విట్ఠో హి సమ్బన్ధో.
రఞ్ఞో ¶ అస్సో పురిసో చే’’ త్య త్ర రఞ్ఞో అస్సో, రఞ్ఞో పురిసో తి చ పచ్చేకం సమ్బన్ధతో సాపేక్ఖతా అత్థీతి న సమాసో. ‘‘అస్సో చ పురిసో చా’’తి ద్వన్దే కతే తు రాజస్సపురిసాతి హోతేవ, అఞ్ఞానపేక్ఖత్తా.
‘‘రఞ్ఞో గరుపుత్తో’’ ఇచ్చత్ర రాజాపేక్ఖినోపి గరునో
పుత్తేన ¶ సహ సమాసో, గమకత్తా. గమకత్తమ్పి సమాసస్స నిబన్ధనం. తత్థ గరునో పుత్తోతి విగ్గహో, ఏవమఞ్ఞత్ర.
క్వచి నిన్దాయం - కూపే మణ్డూకో వియ కూపమణ్డూకో. ఏవం నగరకాకో ఇచ్చాది. అత్రోపమాయ నిన్దా గమ్యతే.
అన్తేవాసికో త్యాదో విభత్త్యలోపో.
బహుబ్బీహిసమాస
అప్పఠమన్తాన ¶ మఞ్ఞేసం పదానం అత్థేసు ద్వే వా బహూని వా నామాని యదా సమస్యన్తే, తదా సో సమాసో బహుబ్బీహి నామ.
ఆగతా సమణా యం సా ఆగతసమణో, విహారో.
౨౧౯. జితాని ¶ ఇన్ద్రియాని యేన సో జితిన్ద్రియో, భగవా. ఆహితో అగ్గి యేన సో ఆహితగ్గి. అగ్యాహితో వాత్యాదో యథేచ్ఛం విసేసనస్స పరతా.
౨౨౦. కరణే తు-ఛిన్నో రుక్ఖో యేన సో ఛిన్నరుక్ఖో, ఫరసు.
౨౨౧. దిన్నో సుఙ్కో యస్స సో దిన్నసుఙ్కో, రాజా.
౨౨౨. నిగ్గతా జనా యస్మా సో నిగ్గతజనో, గామో.
౨౨౩. దస ¶ బలాని యస్స సో దసబలో, భగవా. నత్థి సమో యస్స సో అసమో. ఏత్థ ‘‘అత్తన్నస్సా’’తి యోగవిభాగేన నస్స అ.
పహూతా జివ్హా యస్స సో పహూతజివ్హో, మహన్తీ పఞ్ఞా యస్స సో మహాపఞ్ఞో. ద్వీసు ‘‘ఇత్థియమ్భాసితపుమిత్థీపుమావ చే’’తి పుమ్భావాతిదేసా పుబ్బుత్తరపదేసు ఆఈప్పచ్చయానమభావో.
౨౨౪. ‘‘క్వచి ¶ సమాసన్తగతానమకారన్తో’’తి అన్తస్స అత్తం. కారగ్గహణేన ఆ ఇ చ. ఇత్థియమివణ్ణన్తా, త్వన్తేహి చ కప్పచ్చయోపి. యథా - విసాలం అక్ఖి యస్స సో విసాలక్ఖో, పచ్చక్ఖధమ్మా, సిలోపో. సోభనో గన్ధో యస్స సో ¶ సుగన్ధి. బహుకన్తికో, బహునదికో, సముద్దో. ఏత్థ యదాదినా రస్సో. బహుకత్తుకో. మత్తా బహవో మాతఙ్గా యస్మిం తం మత్తబహుమాతఙ్గం, వనం.
తుల్యాధికరణో.
౨౨౫. సువణ్ణస్స ¶ వియ వణ్ణో యస్స సో సువణ్ణవణ్ణో. వజిరం పాణిమ్హి యస్స సో వజిరపాణి. ఉరసి లోమాని యస్స సో ఉరసిలోమో. ఏత్థ విభత్యలోపో.
‘‘అత్థేసూ’’తి బహుత్తగ్గహణేన క్వచి పఠమన్తానమ్పి. సహ హేతునా యో వత్తతే సో సహేతుకో, ‘‘యదా’’ దినా సహస్స సో.
౨౨౬. సత్త ¶ వా అట్ఠ వా సత్తట్ఠ, మాసా, ఏత్థఞ్ఞపదత్థో వా సద్దస్సత్థో. దక్ఖిణస్సా చ పుబ్బస్సా చ దిసాయ యం అన్తరాలం, సా దక్ఖిణపుబ్బా, దిసా.
భిన్నాధికరణో.
అప్పఠమన్తానన్తి కిం, దేసితో బుద్ధేన యో ధమ్మో.
ద్వన్దసమాస
సముచ్చయో ¶ , తి పిణ్డీకరణం ఏకవిభత్తికానం నామానం యో సముచ్చయో, సో ద్వన్దో నామ, ఇదం సుత్తం బహువచనవిసయం.
చన్దో చ సూరియో చ చన్దసూరియా. తిట్ఠన్తి త్యాది-
క్రియాసమ్బన్ధసామఞ్ఞతో ¶ అత్థేత్థాపేకత్థతా, ఏవం నరనారియో, అక్ఖరపదాని.
౨౨౮. తథా ద్వన్దే పాణి తురియ యోగ్గ సేనఙ్గ ఖుద్దజన్తుక వివిధ విరుద్ధ విసభాగత్థాదీనఞ్చ.
వివిధేనాకారేన విరుద్ధా వివిధవిరుద్ధా, సభాగా సదిసా, వివిధా చ తే సభాగా చేతి విసభాగా. యథా దిగుసమాసే, తథా ద్వన్దే పాణ్యఙ్గత్థాదీనం ఏకత్తం, నపుంసకత్తఞ్చ హోతి.
చక్ఖుసోతం, గీతవాదితం, యుగనఙ్గలం, హత్థస్సం, అసిచమ్మం, డంసమకసం, కోకాలూకం.
నామరూపం ¶ , నామం నమనలక్ఖణం, రూపం రుప్పనలక్ఖణం. ఏవమేతే ధమ్మా లక్ఖణతో వివిధా, పరమత్థతో సభాగా చ.
ఆదిసద్దేనాఞ్ఞత్థాపి ¶ . యథా - భిన్నలిఙ్గానం - ఇత్థిపుమం. యదాదినా రస్సో, దాసిదాసం, పత్తచీవరం. గఙ్గాసోణం.
సఙ్ఖ్యాపరిమాణానం - తికచతుక్కం.
సిప్పీనం - వేణరథకారం.
లుద్దకానం - సాకున్తిక మాగవికం.
అప్పాణిజాతీనం - ఆరసత్థి.
ఏకజ్ఝాయనబ్రాహ్మణానం - కఠకాలాపం ఇచ్చాది.
౨౨౯. విభాసా రుక్ఖ తిణ పసు ధన ధఞ్ఞ జనపదాదీనఞ్చ.
ద్వన్దే ¶ రుక్ఖాదీనం ఏకత్తం నపుంసకత్తఞ్చ వా హోతి.
ధవఖదిరం, ధవఖదిరా, ముఞ్జపబ్బజం, ముఞ్జపబ్బజా, అజేళకం, అజేళకా, హిరఞ్ఞసువణ్ణం, హిరఞ్ఞసువణ్ణాని, సాలియవం, సాలియవా.
కాసికోసలం ¶ కాసికోసలా.
ఆదిసద్దేన అఞ్ఞేసుపి వా. యథా – నిచ్చవిరోధీనమద్దబ్బానం - కుసలాకుసలం, కుసలాకుసలాని.
సకుణీనం - బకబలాకం, బకబలాకా.
బ్యఞ్జనానం - దధిఘతం, దధిఘతాని.
దిసానం - పుబ్బాపరం, పుబ్బాపరా ఇచ్చాది.
అబ్యయీభావసమాస
౨౩౦. అధిసద్దా ¶ స్మిం, తస్స లోపో. అధిసద్దేన తుల్యాధికరణత్తా ఇత్థిసద్దాపిస్మిం. నిచ్చసమాసత్తా ఆధారభూతాయమిత్థియన్తి పదన్తరేన విగ్గహో. అధి ఇత్థియన్తి ఠితే –
ఉపసగ్గనిపాతపుబ్బకో అబ్యయీభావో.
ఉపసగ్గాదిపుబ్బకో సద్దో విభత్యత్థాదీసు సమాసో హోతి, అబ్యయీభావసఞ్ఞో చ.
‘‘సో నపుంసకలిఙ్గో’’తి అబ్యయీభావో నపుంసకలిఙ్గో, యదాదినా ఏకవచనో చ.
‘‘సరో ¶ రస్సో నపుంసకే’’తి రస్సో.
అఞ్ఞస్మా లోపో చ.
అనకారన్తా అబ్యయీభావా పరా సబ్బా విభత్తీ లుజ్జరే. అధిత్థి, విభత్తీనమత్థో ఆధారాది.
ఇధాధిసద్దో ఆధారేవత్తతే, అధిత్థిఇచ్చేతం పదం ఇత్థియ మిచ్చేతమత్థం వదతి.
సమీపం ¶ నగరస్స ఉపనగరం. ‘‘అంవిభత్తీనమకారన్తబ్యయీభావా’’తి విభత్తీనం క్వచి అం.
క్వచీతి కిం. ఉపనగరే.
అభావో మక్ఖికానం నిమ్మక్ఖికం రస్సో. అనుపుబ్బో థేరానం అనుథేరం, అనతిక్కమ్మ సత్తిం యథాసత్తి.
యే ¶ యే బుడ్ఢా యథాబుడ్ఢం, విచ్ఛాయం.
యత్తకో పరిచ్ఛేదో జీవస్స యావజీవం, అవధారణే.
ఆ పబ్బతా ఖేత్తం ఆపబ్బతం ఖేత్తం, మరియాదాయం, వజ్జమానా సీమా మరియాదా, పబ్బతం వినాత్యత్థో.
ఆ జలన్తా సీతం ఆజలన్తం సీతం, అభివిధిమ్హి, గయ్హమానా సీమా అభివిధి, జలన్తేన సహేత్యత్థో.
ఆసద్దయోగే ‘‘ధాతునామా’’దినా అపాదానవిధానేనేవ వాక్యమ్పి సిద్ధం. తథాఞ్ఞత్ర.
౨౩౧. ‘‘ఉత్తమో ¶ వీరో పవీరో’’ ఇచ్చాదో పన పుబ్బపదత్థప్పధానత్తాభావాబ్యయీభావాభావో కమ్మధారయోఏవ. ఏవం విసిట్ఠో ధమ్మో అభిధమ్మో. కుచ్ఛితం అన్నం కదన్నం. ఏత్త్థ ¶ ‘‘కద కుస్సా’’తి సరే కుస్స కదాదేసో.
అప్పకం లవణం కాలవణం, ఏత్థ ‘‘కాప్పత్థేసు చా’’తి కుస్స కా, బహువచనేనాఞ్ఞత్రాపి క్వచి. కుచ్ఛితో పురిసో కాపురిసో, కుపురిసో వా, ఏవమసురాది.
పుబ్బపరూభయమఞ్ఞపదత్థ - ప్పధానాబ్యయీభావ సమాసో;
కమ్మధారయక తప్పురిసా ద్వే, ద్వేన్దో చ బహుబ్బీహి చ ఞేయ్యా.
సమాసో.
౪. తద్ధితకణ్డ
అపచ్చతద్ధిత
ఛట్ఠన్తా ¶ సద్దా ‘‘తస్సాపచ్చ’’మిచ్చస్మిం అత్థే ణో వా హోతి. వాతి వాక్యత్థం. ణేనేవాపచ్చత్థస్స వుత్తత్తా అపచ్చసద్దాప్పయోగో.
‘‘తేసం విభత్యా’’ దో తేసంగహణేన విభత్తిలోపో. తథోత్తరత్ర.
‘‘తేసం ణో లోపం’’తి పచ్చయానం ణస్స లోపో.
‘‘వుద్ధాదిసరస్స వా సంయోగన్తస్స సణే చే’’తి సణకారే పరే అసంయోగన్తస్సాదిసరస్స వుద్ధి.
తస్సాపనియమే –
అయువణ్ణానఞ్చాయో వుద్ధి.
అకారివణ్ణువణ్ణానం ఆఏఓవుద్ధియో హోన్తి, చసద్దేన క్వచి న.
సరలోపాది, తద్ధితత్తా నామమివ కతే స్యాది.
తద్ధితాభిధేయ్యలిఙ్గ–విభత్తివచనా ¶ సియుం.
సమూహభావజా భీయో, సకత్థే ణ్యో నపుంసకే.
తా తుత్థియం నిపాతా తే, ధామిథంపచ్చయన్తకా.
వసిట్ఠస్సాపచ్చం ¶ పోసో వాసిట్ఠో, ఇత్థీ వాసిట్ఠీ, నపుంసకం వాసిట్ఠం. వికప్పవిధానతో తద్ధితేన సమాసస్సాచ్చన్తం బాధాయా భావా వసిట్ఠా పచ్చన్తిపి హోతి.
నపుంసకేన వాపీతి, సద్దసత్థవిదూ విదుం.
౨౩౩. వా ¶ అపచ్చేతి చాధికారో.
ణాయన ణాన వచ్ఛాదితో.
వచ్ఛాదితో గోత్తగణతో ణాయనో ణానో చ వా హోతి.
అపచ్చం పపుత్తప్పభుతి గోత్తం. కచ్చస్సాపచ్చం కచ్చాయనో, కచ్చానో వా. సంయోగన్తత్తా న వుద్ధి.
౨౩౪. ‘‘ణేయ్యో ¶ కత్తికాదీహీ’’తి ణేయ్యో, వినతాయ అపచ్చం వేనతేయ్యో వినతేయ్యో వా. న పక్ఖే వుద్ధి, ణేయ్యోతి యోగవిభాగేన ‘‘తస్స దీయతే’’ త్యత్థేపి ణేయ్యో, దక్ఖిణా దీయతే యస్స సో దక్ఖిణేయ్యో.
అకారన్తతో ¶ అపచ్చే ణి వా హోతి, పున వాసద్దేన ణికో, అకారన్తా అనకారన్తా చ బోపి.
దక్ఖి, సక్యపుత్తికో, మణ్డబ్బో, భాతుబ్బో. ద్విత్తం.
౨౩౬. ‘‘ణవో ¶ పగ్వాదీహీ’’ తి ణవో. మనునో అపచ్చం మాణవో.
౨౩౭. ‘‘ణేర ¶ విధవాదితో’’తి ణేరో, సామణేరో.
సంసట్ఠాదిఅనేకత్థతద్ధిత
౨౩౮. ‘‘యేన ¶ వా సంసట్ఠం తరతి చరతి వహతి ణికో’’తి ణికో. వాకారేన నేకత్థేనేకపచ్చయా చ. ఘతేన సంసట్ఠో ఘాతికో, ఓదనో. ఉళూపేన తరతీతి ఓళూపికో, ఉళూపికో వా, న పక్ఖే వుద్ధి.
సకటేన చరతీతి సాకటికో. సీసేన వహతీతి సీసికో, న వుద్ధి.
ఇత్థిలిఙ్గతో ఏయ్యకో, ణకో చ. చమ్పాయం జాతో చమ్పేయ్యకో. ఏవం బారాణసేయ్యకో. ణకో – కుసినారాయం వసతీతి కోసినారకో. జనపదతో ణకో చ – మగధేసు వసతి, తేసం ఇస్సరో వా మాగధకో.
తజ్జాతియా ¶ విసిట్ఠత్థే ఆజానీయో. అస్సజాతియా విసిట్ఠో అస్సాజానీయో. ఞో - అగ్గన్తి జానితబ్బం అగ్గఞ్ఞం, ద్విత్తం.
౨౩౯. తమధీతే తేన కతాదిసన్నిధాననియోగసిప్పభణ్డ జీవికత్థేసు చ.
తం ¶ అధీతే ఇచ్చాదీస్వత్థేసు ఆదిసద్దేన హతాదీసు చ ణికో వా హోతి. అభిధమ్మమధీతేతి ఆభిధమ్మికో, అభిధమ్మికో వా, న పక్ఖే వుద్ధి. వచసా కతం కమ్మం వాచసికం. ఏవం మానసికం, ఏత్థ –
‘‘స ¶ సరే వాగమో’’తీహానువత్తితాదిసద్దేన సాగమో.
సరీరే సన్నిధానా వేదనా సారీరికా. ద్వారే నియుత్తో దోవారికో, ఏత్థ- ‘‘మాయూనమాగమో ఠానే’’తి వకారతో పుబ్బే ఓకారాగమో.
సిప్పన్తి ¶ గీతాదికలా, వీణా అస్స సిప్పన్తి వేణికో, అత్ర వీణేతి వీణావాదనం. గన్ధో అస్స భణ్డన్తి గన్ధికో, మగే హన్త్వా జీవతీతి మాగవికో, వకారాగమో. జాలేన హతో జాలికో, సుత్తేన బద్ధో సుత్తికో, చాపో అస్స ఆయుధన్తి చాపికో, వాతో అస్స ఆబాధో అత్థీతి వా వాతికో, బుద్ధే పసన్నో బుద్ధికో, వత్థేన కీతం భణ్డం వత్థికం.
కుమ్భో ¶ అస్స పరిమాణం, త మరహతి, తేసం రాసి వా కుమ్భికో. అక్ఖేన దిబ్బతీతి అక్ఖికో, మగధేసు వసతి, జాతోతి వా మాగధికో ఇచ్చాది.
౨౪౦. ణ రాగా తేన రత్తం తస్సేదమఞ్ఞత్థేసు చ.
తేన ¶ రత్తం త్యాద్యత్థేసు ణో వా హోతి. కసావేన రత్తం కాసావం.
ఏవం ¶ నీలం పీతమిచ్చాది. న వుద్ధి, మహిసస్స ఇదం మాహిసం, సిఙ్గం.
ఏవం ¶ రాజపోరిసం, ఏత్థ ‘‘అయువణ్ణానఞ్చా’’ దో పున వుద్ధిగ్గహణేన ఉత్తరపదస్స వుద్ధి. మగధేహి ఆగతో, తత్ర జాతో, తేసం ఇస్సరో, తే అస్స నివాసోతి వా మాగధో, కత్తికాదీహి యుత్తో కత్తికో, మాసో.
బుద్ధో ¶ అస్స దేవతాతి బుద్ధో. బ్యాకరణం అవేచ్చ అధీతేతి వేయ్యాకరణో. ఏత్థ ‘‘మాయూనమా’’దినా యకారతో పుబ్బే ఏ ఆగమో, యస్స ద్విత్తం. సగరేహి నిబ్బత్తో సాగరోఇచ్చాది.
జాతాదీసు ¶ ఇమో ఇయో చ హోతి, చసద్దేన కియో చ. పచ్ఛా జాతో పచ్ఛిమో, మనుస్సజాతియా జాతో మనుస్సజాతియో. అన్తే నియుత్తో అన్తిమో, అన్తియో.
ఏవం అన్ధకియో. పుత్తో అస్స అత్థీతి పుత్తిమో, పుత్తియో. ఏవం కప్పియో.
౨౪౨. ‘‘తదస్సట్ఠానమీయో ¶ చే’’తి ఈయో, చకారేన హితాద్యత్థేపి, బన్ధనస్స ఠానం బన్ధనీయం, చఙ్కమనస్స హితం చఙ్కమనీయం.
౨౪౩. ‘‘ఆలు ¶ తబ్బహులే’’తి ఆలు. అభిజ్ఝాబహులో అభిజ్ఝాలు.
విసేసతద్ధిత
౨౪౪. విసేసే తరతమిస్సికియిట్ఠా.
అతిసయత్థే తరాదయో హోన్తి.
అయమేతేసం ¶ అతిసయేన పాపోతి పాపతరో, పాపతమో, పాపిస్సికో, పాపియో, పాపిట్ఠో వా.
‘‘వుద్ధస్స ¶ జో ఇయిట్ఠేసూ’’తి వుద్ధస్స జాదేసే – ‘‘సరలోపా’’దో పకతిగ్గహణేన పకత్యభావా ఇస్స ఏ. జేయ్యో, జేట్ఠో.
ఏవం ‘‘పసత్థస్స సో చే’’తి సాదేసే సేయ్యో, సేట్ఠో.
అస్సత్థితద్ధిత
౨౪౫. ‘‘తదస్సత్థీతి ¶ వీ చే’’తి వీ. మేధా అస్స అత్థీతి మేధావీ.
౨౪౬. ఏవం ¶ ‘‘తపాదితో సీ’’తి సీ, ద్విత్తం, తపస్సీ.
౨౪౭. ‘‘దణ్డాదితో ¶ ఇక ఈ’’తి ఇకో, ఈ చ. దణ్డికో, దణ్డీ.
౨౪౮. ‘‘గుణాదితో వన్తూ’’తి వన్తు. గుణవా, పఞ్ఞవా. యదాదినా రస్సో.
౨౪౯. ‘‘సత్యాదీహి ¶ మన్తూ’’తి మన్తు. సతిమా, భానుమా.
౨౫౦. ‘‘ఆయుస్సుకారాస్మన్తుమ్హీ’’తి ¶ ఉస్స అస. ఆయస్మా.
౨౫౧. ‘‘సద్ధాదితో ణ’’ ఇతి ణో. సద్ధో.
౨౫౨. ‘‘తప్పకతివచనే ¶ మయో’’తి మయో. సువణ్ణేన పకతం సోవణ్ణమయం, సువణ్ణమయం వా. పక్ఖే - యదాదినా వుద్ధి.
ఏతేసమో లోపే.
విభత్తిలోపే మనాదీనమన్తస్స ఓ హోతి. మనోమయం.
సఙ్ఖ్యాతద్ధిత
౨౫౩. సఙ్ఖ్యాపూరణే ¶ త్యధికారో.
‘‘ద్వితీహి తియో’’తి తియో, ‘‘తియే దుతాపి చే’’తి ద్వితీనం దుతా. ద్విన్నం పూరణో దుతియో, ఏవం తతియో.
౨౫౪. ‘‘చతుచ్ఛేహి థఠా’’తి థఠా. చతుత్థో, ఛట్ఠో.
౨౫౫. తేసమడ్ఢూపపదేన అడ్ఢుడ్ఢ దివడ్ఢ దియడ్ఢాడ్ఢతియా.
చతుత్థ ¶ దుతియ తతియానం అడ్ఢూపపదేన సహ అడ్ఢుడ్ఢ దివడ్ఢ దియడ్ఢాడ్ఢతియా హోన్తి.
అడ్ఢేన చతుత్థో అడ్ఢుడ్ఢో, అడ్ఢేన దుతియో దివడ్ఢో, దియడ్ఢో వా, అడ్ఢేన తతియో అడ్ఢతియో.
౨౫౬. ‘‘సఙ్ఖ్యాపూరణే ¶ మో’’తి మో, పఞ్చమో. ఇత్థియం పఞ్చన్నం పూరణీ పఞ్చమీ.
ఏకో చ దస చాతి ద్వన్దే కతే –
ద్వేకట్ఠానమాకారో వా.
సఙ్ఖ్యానే ఉత్తరపదే ద్విఏకఅట్ఠఇచ్చేతేస మన్తస్స ఆ వా హోతి. ఏకాదస పఞ్చీవ. ఏవం ద్వాదస.
యదాదినా తిస్స తేఆదేసే ‘‘ఏకాదితో దస్స ర సఙ్ఖ్యానే’’తి దససద్దే దస్స రో. తేరస.
౨౫౭. ‘‘చతూపపదస్స ¶ లోపో తుత్తరపదాదిచస్స చుచోపి నవా’’తి చతుసద్దే తుస్స లోపో చస్స చు చ. చుద్దస.
‘‘దసే సో నిచ్చఞ్చే’’తి ఛస్స సోఆదేసే – ‘‘ళ దరానం’’తి దససద్దే దస్స ళో. సోళస, అట్ఠారస.
౨౫౮. ‘‘వీసతి ¶ దసేసు బా ద్విస్స తూ’’తి ద్విస్స బా. బావీసతి, ఏకాదసన్నం పూరణో ఏకాదసమో.
౨౫౯. ‘‘ఏకాదితో దసస్సీ’’తి ఇత్థియం ఈ. ఏకాదసీ ఇచ్చాది.
‘‘ద్వాదితో కోనేకత్థే చే’’తి కో, ద్వే పరిమాణాని అస్సేతి ద్వికం. ఏవం తికాది.
౨౬౦. ‘‘సమూహత్థే ¶ కణ్ణా’’తి కణ చ, ణో చ. మనుస్సానం సమూహో మానుస్సకో, మానుస్సో వా.
ణే కతే – ‘‘ఝలానమియువా సరే వా’’ తీహ వాకారేన ఇస్స అయాదేసే – ద్వయం, తయం. ఏవం ‘‘గామజనబన్ధుసహాయాదీహి తా’’తి తా. గామతా, నాగరతా.
భావతద్ధిత
భావత్థే ణ్యత్తతా హోన్తి. తుసద్దేన త్తనో చ. సకత్థాదీసుపి ణ్యో, సకత్థే తా చ.
హోన్త్యస్మా ¶ సద్దఞాణాని,
భావో సా సద్దవుత్తియా;
నిమిత్తభూతం నామఞ్చ,
జాతి దబ్బం క్రియా గుణో.
౨౬౩. యథా ¶ – చన్దస్స భావో చన్దత్తం. ఇహ నామవసా చన్దసద్దో చన్దద్దబ్బే వత్తతే, నిమిత్తస్స రూపానుగతఞ్చ ఞాణం. ఏవం మనుస్సత్తన్తి మనుస్సజాతివసా. యదాదినా ఈస్స రస్సే – దణ్డిత్తన్తి దణ్డద్దబ్బసమ్బన్ధా. పాచకత్తన్తి పచనక్రియాసమ్బన్ధా. నీలత్తన్తి నీలగుణవసా.
ఏవం ణ్యాదీసుపి యథాయోగం ఞేయ్యం. ణ్యో.
అవణ్ణో యే లోపఞ్చ.
యే ¶ పరే అవణ్ణో లుప్యతే, చకారేన ఇకారోపి.
యవతం తలణదకారానం బ్యఞ్జనాని చలఞ జకారత్త’’న్తి యకారయుత్తానం తాదీనం చాదయో, కారగ్గహణేన సకపభమాదితో పరయకారస్స పుబ్బేన సహ క్వచి పుబ్బరూపఞ్చ, ద్విత్తం. పణ్డిచ్చం, కోసల్లం, సామఞ్ఞం, సోహజ్జం, పోరిస్సం, నేపక్కం, సారుప్పం, ఓసబ్భం, ఓపమ్మం.
ఆత్తఞ్చ.
ఇఉఇచ్చేతేసం ఆ హోతి, రికారాగమో చ ఠానే.
సరలోపాదినా ఇలోపో. ఇసినో భావో.
ఆరిస్సం ¶ . ఏవం ముదుతా, అరహతా, న్తస్స యదాదినా లోపో.
పుథుజ్జనత్తనం, అకిఞ్చనమేవ ఆకిఞ్చఞ్ఞం, కుణ్డనియా అపచ్చం కోణ్డఞ్ఞో, ఏత్థ వుద్ధాదో వాకారేన సంయోగన్తస్సాపి వుద్ధి.
పదాయ ¶ హితం పజ్జం, ధనాయం సంవత్తనికం ధఞ్ఞం, సతితో సమ్భూతం సచ్చం, ఇలోపో, తీసు న వుద్ధి. దేవో ఏవ దేవతా.
౨౬౪. ‘‘ణ ¶ విసమాదీహీ’’తి భావే ణో. వేసమం. ఉజునో భావో అజ్జవం. ఏత్థ ఉస్స ఆత్తే పరూకారస్స యదాదినా అవో.
౨౬౫. ‘‘రమణీయాదితో ¶ కణ్తి కణ. మానఞ్ఞకం.
అబ్యయతద్ధిత
౨౬౬. ‘‘విభాగే ¶ ధా చే’’తి ధా, చకారేన సోప్పచ్చయో చ. ఏకేన విభాగేన ఏకధా, నిపాతత్తా సిలోపో. పదవిభాగేన పదసో.
౨౬౭. ‘‘సబ్బనామేహి పకారవచనే తు థా’’తి థా. తుకారేన థత్తా చ. సబ్బో పకారో, సబ్బేన పకారేన వా సబ్బథా. ఏవం అఞ్ఞథత్తా.
౨౬౮. ‘‘కిమిమేహి ¶ థ’’న్తి థం, కాదేసే-కథం. ఇఆదేసే-ఇత్థం, థన్తి యోగవిభాగేన థం-బహుత్థం.
౨౬౯. అమలినం మలినం కరోతీత్యాద్యత్థే-అభూతతబ్భావే గమ్యమానే కరభూయోగే సతి నామతో యదాదినా ఈప్పచ్చయో, మలినీకరోతి సేతం. అభస్మనో భస్మనో కరణన్తి భస్మీకరణం కట్ఠస్స. అమలినో మలినో భవతీతి మలినీభవతి సేతో. ఈప్పచ్చయన్తోపి నిపాతో. అభూతతబ్భావేతి కిం, ఘటం కరోతి, ఘటో భవతి.
కరభూయోగేతి ¶ కిం, అమలినో మలినో జాయతే.
అవత్థావతోవత్థయా, భూతస్సఞ్ఞాయ వత్థునో.
తాయావత్థాయ భవనం, అభూతతబ్భవం విదుం.
తద్ధితో.